రష్మిక ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా..!
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె పెదవులపై ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. రష్మిక పెదవులు అందంగా లేవని చాలామంది ఆమెను విమర్శించారు. దీంతో ఆమె ఎవరికి తెలియకుండా తన లిప్స్‌కు సర్జరీ చేయించుకుందట. ఆ సర్జరీ తరువాత రష్మిక మరింత అందంగా కనిపించడంతో పాటు, వరుస హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. ప్రస్తుతం రష్మిక పెదవులు సర్జరీకి సంబంధించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications