Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ హీరోయిన్‌తో ముద్దు సీన్ కోసం రవితేజ దర్శకుడిని ఒత్తిడి చేశాడా...?

మాస్ రాజా రవితేజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రవితేజ , ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీకోసం' సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు.

గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించారు. అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీ ఇస్తున్నారు.ఉన్నది ఉన్నట్టు చెప్పడం రవితేజకు అలవాటు. రవితేజ సినిమాల్లో తప్పిస్తే, బయట పెద్దగా కనిపించరు, మాట్లాడరు.అయితే తాజాగా రవితేజ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Did Ravi Teja pressure the director to have a kissing scene with that heroine

రవితేజ ఓ సినిమాలో హీరోయిన్‌తో ముద్దు కావాలని దర్శకుడిని అడిగి మరీ అలాంటి సీన్ పెట్టించుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హీరోయిన్ మరేదో కాదు...మీనాక్షి చౌదరి. ఖిలాడి సినిమాలో రవితేజతో కలిసి మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమాలో రవితేజ కి మీనాక్షి చౌదరికి మధ్యలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంటుంది. అయితే ఈ సీన్ రవితేజ కావాలని పెట్టించారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో అసలు ఆ సీన్ అవసరం లేదని.. అయితే రవితేజనే స్వయంగా దర్శకుడుని అడిగిమరీ ఆ సీన్ రాయించుకొని పెట్టారని ప్రచారం సాగింది.

అయితే ఈ ప్రచారంపై రవితేజ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో అలాంటి వ్యక్తి కాదని క్లారిటీ ఇస్తున్నారు. గతంలో రవితేజ కూడా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తాను నటించిన సినిమా రిలీజ్ అయితే అది హిట్టా, ఫట్టా అని పట్టించుకుకొనని రవితేజ తెలిపారు. ఈ సందర్భంగా రవితేజ తాను జయాపజయాలని ఎలా తీసుకుంటారో వివరించారు. మూవీ కోసం ఏం చేయాలో అంతా చేస్తాం.. ఒక సారి కంప్లీట్ అయ్యాక అది అనవసరమని రవితేజ చెప్పుకొచ్చారు. కొన్ని చిత్రాలు చేస్తున్నప్పుడు మధ్యలోనే అర్థం అవుతుంది..ఇది కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని. కానీ సగం పూర్తయ్యాక ఏమి చేయలేమని రవితేజ అన్నారు. ఎక్కువగా నేను స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ కాను. నా వరకు కథ కోసం ఏమి మార్చుకోగలనో అని ఆలోచిస్తా. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత కథలో జోక్యం చేసుకోనని రవితేజ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎవరో రవితేజ అంటే గిట్టని వారే ఇలాంటి ఆయనపై దుష్ప్రచారం చేశారని అర్థం అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+