సమంత -నాగచైతన్య రహస్యంగా కలిశారా..? ఆధారాలతో సహా దొరికిపోయిన వైనం
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు.
కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు.
Always Down to Earth!
— Aarya Prasad (@Aaryaprasad) October 2, 2023
Man with a golden heart ❤️❤️
#Yuvasamrat @chay_akkineni pic.twitter.com/chV658qit7
అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత రహస్యంగా కలుసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సమంత ఇష్టంగా పెంచుకునే కుక్క పిల్ల సడన్‌గా నాగచైతన్య దగ్గర దర్శనం ఇచ్చింది. పెట్ డాగ్ హష్ సమంతకు ఎంతో ఇష్టమైందో అందరికి తెలిసిందే.

సమంత ఎక్కడకు వెళ్లిన ..పెట్ డాగ్ హష్‌ను కూడా తనతో తీసుకువెళ్తుంది. అలాంటి పెట్ డాగ్ హష్ ఒక్కసారిగా నాగచైతన్య దగ్గర కనిపించడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. సమంత దగ్గర ఉండాల్సిన పెట్ డాగ్ ఎలా నాగచైతన్య దగ్గరకు వచ్చిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
సమంత , నాగచైతన్య రహస్యంగా ఏమైనా కలిశారా ఏంటీ అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పెట్ డాగ్ హష్ నాగచైతన్య దగ్గరే ఉందని చెప్పే వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో సమంత , నాగచైతన్య రహస్యంగా కలిశారంటూ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. పెట్ డాగ్ హష్ నాగచైతన్య దగ్గర ఉందని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications