Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకరి బదులు మరొకర్ని బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటించారా..?

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-8 సీజన్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. 105 రోజుల పాటు బిగ్ బాస్-8వ సీజన్ నిర్విరామంగా జరిగింది. ఈ 105 రోజుల్లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో హంగులతో బిగ్ బాస్ 8వ సీజన్ ఆకట్టుకుంది. 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో..ఆ తర్వాత 9 మంది పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌‌లోకి రప్పించి ఈ షోని మరింత రక్తి కట్టించారు.

ఇక ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. సీజన్ చివరి దశకు చేరుకునే సరికి టాప్-5లో అవినాష్, గౌతమ్ కృష్ణ, నబీల్ అఫ్రిది,నిఖిల్,ప్రేరణ నిలిచారు. వీరిలో నిఖిల్ , గౌతమ్ కృష్ణలు ఫైనల్‌కు చేరారు. చివరకు బిగ్ బాస్-8 సీజన్ విన్నర్‌గా నిఖిల్ నిలిచారు. షో మొదటి నుంచి కూడా తన గేమ్‌తో అదరగొట్టిన నిఖిలే విజేతగా నిలిచాడు. అయితే విన్నర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Did they announce the winner of Bigg Boss instead of each other

ఓటింగ్ శాతంలో నిఖిల్ కంటే గౌతమ్ కృష్ణనే ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది.ఒకనొక దశలో గౌతమ్ కృష్ణనే విన్నర్ అనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరికి నిఖిల్‌ను బిగ్ బాస్ యాజమాన్యం విన్నర్‌గా ప్రకటించింది. సీజన్ తొలి నుంచి కూడా నిఖిల్‌ విన్నర్ అవుతారని భావించారు. కానీ గౌతమ్ ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. నిఖిల్‌కు గౌతమ్ కృష్ణ గట్టి పోటినిచ్చాడు.దీంతో అతను టైటిల్ రేసులోకి దూసుకువచ్చాడు. ఓటింగ్‌లో కూడా అతనే ముందున్నాడని తెలుస్తోంది.

కానీ మా టీవీలో సీరియల్స్‌తో పాటు, పలు కార్యక్రమాల్లో నిఖిల్‌ ఉండటంతోనే అతన్ని విన్నర్‌‌గా ప్రకటించారని సమాచారం. గౌతమ్ అభిమానులు ప్రధానంగా దీని గురించే ప్రస్తావిస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని బయటపెట్టాలని గౌతమ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన వాళ్లకు టైటిల్ ఇచ్చే లెక్క అయితే అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకని గౌతమ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గౌతమ్ కృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిఖిల్‌ విన్నర్ కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.నిఖిల్‌ బిగ్‌బాస్ ట్రోఫితో పాటు, రూ.55 లక్షలు రూపాయిలు ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+