ఏంటీ వెంకటేష్ ఆ హీరోయిన్‌ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది కచ్చింతంగా విక్టరీ వెంకటేష్ అని చెప్పాలి. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు వెంకటేష్. తొలుత నటనపై పెద్దగా ఆసక్తి లేకుండానే ఆయన సినిమాల్లోకి ఇంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు చెప్పడం జరిగింది. అప్పటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అందరూ కూడా మాస్ సినిమాలు చేస్తూ స్టార్ హీరో కావాలని ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ మాత్రం ఫ్యామిలీ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.

ముఖ్యంగా వెంకటేష్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియోన్స్‌ థియేటర్లకు క్యూ కట్టేశారు. అభిమానుల కోసం అప్పడుప్పుడు మాస్ సినిమాలు చేసి అభిమానులను ఆయన అలరించారు. అయితే వెంకటేష్ కెరీర్‌లో ఎక్కువగా ఫ్యామిలీ మెచ్చే సినిమాలే చేశారు. ఇదిలా ఉంటే 1990ల్లో వెంటకేష్‌పై ఓ రూమర్ తెగ వైరల్ అయింది. వెంకటేష్ తన భార్యకు విడాకులిచ్చి, ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. సౌందర్య.

Did Venkatesh want to marry that heroine for the second time

అవును సౌందర్యను వెంకటేష్ వివాహం చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో అత్యధిక సినిమాలు వచ్చాయి.దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ విషయంలో వెంకటేష్‌కి ఆయన భార్య నీరజకు మధ్య గొడవలు జరిగినట్టు అప్పట్లో కథనాలు వెలిశాయి. సౌందర్య విషయంలో అలెర్ట్ అయ్యారట వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు. వెంటనే సౌందర్యను పిలిపించి అడగ్గా, అలాంటిది ఏమీ లేదని మీడియాలో వస్తున్నట్లు వెంకటేష్‌కు నాకు మధ్య ఎలాంటి బంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

తమ బంధం కేవలం సినిమాల వరకే పరిమితమని తేల్చేశారట. అయితే మీ మధ్య ఇలాంటి రూమర్ల ఆగిపోవాలంటే నువ్వు నా కొడుకుకి రాఖీ కట్టాలని చెప్పారట రామానాయుడు. సౌందర్య మనసులో వెంకటేష్‌పై ఎలాంటి ఉద్దేశం లేకపోవడంతో వెంటనే వెళ్లి వెంకటేష్‌కి రాఖీ కట్టిందట. ఈ విషయం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+