హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో SSMB 29 టీమ్... మహేష్ న్యూలుక్ చూశారా..?
దర్శక ధీరేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబీనేషనల్ వస్తోన్న ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ 29. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ చిత్రంలో మహేష్‌బాబు న్యూలుక్‌లో కనిపించనున్నారు. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా నెట్టింట అది వైరల్ అవుతోంది. తాజాగా, ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించింది. స్టార్ డైరెక్టర్ రాజౌమళి, మహేశ్‌బాబు , నిర్మాత కేఎల్ నారాయణ హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం మహేశ్‌బాబు, రాజమౌళి అండ్ టీమ్ కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ పనులు ముగించుకుని నేడు టీమ్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మహేశ్ న్యూ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రిన్స్ మహేష్‌బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తారు. అయితే, SSMB 29 మూవీ లుక్ టెస్ట్‌లో భాగంగానే ఈచిత్ర యూనిట్ దుబాయ్‌కు వెళ్లిందని టీ టౌన్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Superstar @urstrulyMahesh back home ♥️ #MaheshBabu was papped along with @ssrajamouli and KL Narayana at the airport ✈️
— Viswa CM (@ViswaCM1) April 19, 2024
#SSMB29 pic.twitter.com/cvT1UN5Rzo
రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో సినిమా..
ఈ చిత్రం ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్‌తో రాబోతుందని టాక్. ఈ సినిమాలో పాపులర్ హాలీవుడ్ నటుడు కనిపించబోతున్నారు. ఆయనతో పాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లు కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాను సరికొత్త అధునాతన టెక్నాలజీతో తెరకెక్కించేందుకు ఏకంగా రూ.1000కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక, ఈ మూవీకి 'మహారాజ్' అనే టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇండోనేషియాకు చెందిన ఓ నటిని తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విలన్ రోల్లో కనిపించనున్నారట.












Click it and Unblock the Notifications