హరీష్ కాంగ్రెస్ లోకి వస్తానంటే- TPCC చీఫ్ బిగ్ ఆఫర్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాళేశ్వరం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రేవంత్ చేసిన సవాల్ కు హరీస్ స్పందిస్తూ.. తనకు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే సక్సెస్ చేస్తానని వెల్లడించారు. దీని పైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. హరీష్ కు ఆఫర్ ఇచ్చారు. హరీష్ కాంగ్రెస్ లోకి వస్తానంటే.. నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ రాజకీయంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య కాళేశ్వరం కేంద్రంగా సవాళ్లు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ కాళేశ్వరం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కన్వీన్స్ చేస్తే.. మూడేళ్లు ఆయనకే కాళేశ్వరం అప్పగిస్తానని చెప్పారు. దీని పైన హరీష్ స్పందించారు. కాళేశ్వరం నీటి వినియోగం పైన వివరించారు. కేసీఆర్ వరకు అవసరం లేదని.. తనకు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే.. తానే నిర్వహించి చూపిస్తానని సవాల్ చేసారు. దీని పైన స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామని చెప్పారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి హరీశ్‌ను చేర్చుకునే అంశం పైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

పార్టీలో నేతల మధ్య వివాదాల పైనా కీలక వ్యాఖ్యలు
హరీష్ గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేసారని.. పదేళ్లు ఏం చేయని వీరు మూడు నెలల సమయం ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ అప్పులు, తప్పులను సరి చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అదే విధంగా తాజా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదం పైనా స్పందించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజంగా ఉంటాయని చెప్పారు. పార్టీ లో స్వేచ్ఛ ఉంటుందని.. దుర్వినియోగం చేస్తే చూస్తూ ఉండమని స్పష్టం చేసారు. తుంగతుర్తి సమస్య కూడా పరిష్కారం అ వివుతుందని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు వింటామని చెప్పిన మహేష్ గౌడ్...పార్టీలో అందరూ సమానమే అని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండడం వల్ల ఇద్దరు సీనియర్ నాయకులను సమస్య పరిష్కారం కోసం నియమించామని చెప్పుకొచ్చారు . సస్పెండ్ చేయడమే పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.













Click it and Unblock the Notifications