దిల్ రాజు జస్ట్ మిస్.. లేకపోతే శంకరగిరి మాన్యాలే..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దాదాపు 25 ఏళ్లుగా కెరీర్ లో ఎన్నో విజయాలు.. అపజయాలు చూశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ను అందించారు. అయితే కొన్ని సార్లు దెబ్బలూ తగిలాయి. కానీ ప్రస్తుతం అత్యధిక హిట్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. అయితే ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ మూవీతో భారీ నష్టాలను చవి చూశారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బయట పడ్డారు. మరోసారి ఇటీవల నితిన్ తమ్ముడు సినిమాతో భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాతో దిల్ రాజుకు పెద్ద దెబ్బ తగిలింది.
అయితే తాజాగా దిల్ రాజుపెద్ద ప్రమాదం నుండి తప్పుకున్నట్లు సమాజం. హరి హర వీరమల్లు నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను దిల్ రాజు కొనే ప్రయత్నం చేశారు. దిల్ రాజు ఆ రెండు ఏరియాలను కలిపి రూ. 50 కోట్లకు అడిగినట్లు సమాచారం. హరి హర వీరమల్లు నిర్మాతలు రూ. 80 కోట్లు డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గాడట. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ జులై 24 ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమాకు మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పెద్ద దెబ్బ తీశాయని, ఏమాత్రం బాగోలేని నాసిరకంగా గ్రాఫిక్స్ చూపించారని ఆడియెన్స్, నెటిజన్స్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications