రావిపూడి రక్తంతో విజయం తిలకం.. వీడియో వైరల్

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ ఎంటర్ టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి.. తన కెరీర్లో ఇప్పటివరకు అపజయం అనేది ఎరుగకుండా దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్‌రామ్ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా నేటి(జూన్ 22) నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన ఓ ప్రత్యేక ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చిత్ర బృందం పంచుకున్న ఈ సరికొత్త వీడియో విషయానికి వస్తే.. ఇందులో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి తన అభిమానులు తనకు బహూకరించిన ఓ పెద్ద కత్తిని పట్టుకుని అక్కడికి వస్తారు. ఆ కత్తిని తీసుకుని విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి బొటనవేలును కొద్దిగా కోసి, వచ్చిన రక్తంతో అనిల్ నుదుటిపై వీర తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కల్యాణ్ రామ్ కూడా అదే రీతిలో అనిల్ రావిపూడికి తిలకం పెడతారు.

Director Anil Ravipudi Hilarious Video Viral Venkatesh and Kalyan Ram New Movie Shoot Begins

కేవలం హీరోలే కాకుండా ఈ సినిమాలో నటిస్తున్న గ్లామర్ క్వీన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టిలు కూడా ఈ ఫన్నీ వీడియోలో భాగమయ్యారు. వారిద్దరూ కూడా అనిల్ రావిపూడికి తిలకం పెట్టే క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకుంటూ నవ్వులు పూయించారు. వీరితో పాటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా ఈ ఫన్నీ సీక్వెన్స్ లో కనిపించి సందడి చేశారు. సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కలిసి చేసిన ఈ ప్రాంక్ తరహా వీడియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.


ఇక ఈ ప్రమోషనల్ వీడియో ముగింపులో చిత్ర బృందం సినిమా కథాంశం, బ్యాక్‌డ్రాప్‌పై ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం పక్కా రాయలసీమ నేపథ్యంలో సాగనుందని మేకర్స్ స్పష్టం చేశారు. సాధారణంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అనగానే అందరికీ ఫ్యాక్షనిజం, రక్తం ఏరులై పారడం, కత్తులు, బాంబుల హింస గుర్తుకు వస్తాయి. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమాలో అలాంటివేమీ ఉండవని తేల్చి చెప్పారు. రాయలసీమ సంస్కృతి, అక్కడి యాసను చూపిస్తూనే.. కుటుంబ సమేతంగా కూర్చుని నవ్వుకునేలా ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు ప్రకటించారు. ఒక క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+