రామ్ చరణ్ 'పెద్ది' గ్లింప్స్‌లో క్రికెట్ షాట్ క్రెడిట్ అతనికే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం 'పెద్ది' సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ న‌డుస్తుంది. ఈ క్రమంలోనే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్‌ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు.

director-buchibabu-comments-on-ram-charans-cricket-shot-in-peddi-glimpse

అదరగొట్టిన గ్లింప్స్..

ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అద‌ర‌గొట్టాడు చరణ్. వీడియో చివ‌ర‌లో క్రికెట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే ఈ షాట్ ఆలోచ‌న ఎవ‌రిది అనేది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు వివ‌రించారు. ఫైట్ మాస్ట‌ర్ న‌వ‌కాంత్ ఆ షాట్‌ని డిజైన్ చేయ‌గా.. అత‌నికే ఆ క్రెడిట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నాను అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+