హిట్ లేకపోతే ఇచ్చే కాఫీని కూడా చిరంజీవి వెనక్కి పంపిస్తాడు: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అందులో మూడు దశాబ్దాలు అగ్ర కథానాయకుడిగా కొనసాగారు. ప్రస్తుతం యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వారికి సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కు, రామ్ చరణ్ కు పడటంలేదు. మెగా కుటుంబానికి బన్నీ దూరంగా ఉంటున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మాత్రం జైలు నుంచి రాగానే చిరంజీవి, నాగబాబు ఇంటికి వచ్చి స్వయంగా కలిశాడు. ఆ తర్వాత మళ్లీ మాములే. తాజాగా ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి, అల్లు అరవింద్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి మనస్తత్వాలను విశ్లేషించి చెప్పారు.
హిట్ దర్శకుణ్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు
సినిమా హిట్ అయితే దర్శకులను పిలిచి శాలువా కప్పి వారికి తగిన గౌరవం చిరంజీవి ఇస్తాడని, తనతో సినిమా చేస్తే తనకు కూడా ఓ హిట్ ఇస్తాడేమో అని ఆలోచిస్తాడన్నారు. అతన్ని కాకాపట్టి సినిమా ఓకే చేయించుకుంటాడని, ఆ దర్శకుడు శంకరే అవ్వాల్సిన అవసరంలేదని, హిట్ సినిమా తీసిన ఏ దర్శకుడైనా పర్వాలేదన్నారు. చిరంజీవి మనస్తత్వమే అంత అన్నారు. డైరెక్టర్ హిట్ సినిమా ఇచ్చాడంటే అతడి దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందనే విషయాన్ని చిరంజీవి గ్రహిస్తాడని, దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడని, హిట్ కాకపోతే కనీసం కాఫీ కూడా ఇవ్వడన్నారు. చిరంజీవి ఇంటికి వెళ్లేవారికి ఇదేరకమైన ట్రీట్ మెంట్ ఉంటుందన్నారు.

రా.. రా.. అంటూ స్వాగతం పలుకుతాడు
హిట్ లేకపోతే చేతులవరకు వచ్చిన కాఫీని కూడా తిరిగి వెనక్కి పంపించి వెళ్లగొడతాడని, హిట్ డైరెక్టర్ అయితే రా.. రా.. అంటూ స్వాగతం చెప్పి మరీ తీసుకువెళతాడని గీతాకృష్ణ వివరించారు. తన బావమరిది అల్లు అరవింద్ నుంచి చిరంజీవి ఈ విషయం నేర్చుకున్నాడని, ఇద్దరూ ఒకటే అని చెప్పారు. కొడుకులు హీరోలైన తర్వాత మార్కెట్ కోసం కొట్టుకొని గొడవలు వచ్చాయికానీ వారిద్దరు మాత్రం ఒకటే అని గీతాకృష్ణ స్పష్టం చేశాడు. అల్లు అరవింద్ పెద్ద నిర్మాత అవడానికి చిరంజీవి కారణమైతే చిరంజీవి పైకి రావడానికి అల్లు అరవింద్ కారణమని, ఇద్దరూ కృష్ణార్జునుల్లాంటివారని, ఇప్పుడు కొడుకులవల్ల గొడవలు వచ్చినాయేమోకానీ ఇద్దరూ మాత్రం ఒకటే అన్నారు.












Click it and Unblock the Notifications