Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంకటేష్‌ను ఘోరంగా అవమానించిన నయనతార

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

విఘ్నేష్ శివన్‌ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనేసినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు.

director maruthi comments on Nayanthara behaviour

ఇక నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ నుంచి విడాకులు తీసుకుంటుందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. నయనతార నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తుందనే చెప్పాలి. నయనతార గురించి నిర్మాత అనంతనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో నయనతార తాను ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లమని నిర్మాత అనంతనన్ తెలిపారు. అయితే తాను అక్కడ ఉన్నంత కాలం నయనతార తెగ హడావిడి చేస్తూ కనిపించేదట.

ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెట్టి విసిగిపోయినట్లుగా చేసేవారట. నయనతార రాత్రిపూట ఎక్కువ హాడావిడి చేసి నిద్రలేకుండా చేసేవారట. అర్ధరాత్రి నిద్రలేచి, ఫోన్‌లో అరుస్తూ.. గోల చేస్తూ.. చుట్టు ఉన్నవారిని ఇబ్బందిపెట్టేవారట. నయనతార వల్ల అపార్ట్ మెంట్ లో చాలా ఇబ్బందులు రావడంతో ఇవి తట్టుకోలేక అపార్ట్‌మెంట్ యజమాని నటిని ఖాళీ చేయమని కోరినట్లు. ఆ కారణంతో నయనతార అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసిందని ఆయన తెలిపారు.

తాజాగా దర్శకుడు మారుతి సైతం నయనతారపై తీరుపై విమర్శలు చేశారు. మారుతి దర్శకత్వంలో నయనతార 'బాబు బంగారం' సినిమాలో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్‌ హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నయనతార ఏ విషయంలోనూ యూనిట్‌కి సహకరించేది కాదని మారుతి తెలిపారు. నేను అప్పటికి పెద్ద డైరెక్టర్‌ని కాకపోవచ్చు. నన్ను గౌరవించకపోయినా ఫర్వాలేదు.

కనీసం వెంకటేష్‌లాంటి సీనియర్‌ని కూడా ఆమె పట్టించుకునేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.ఎంతో ఓపికగా భరించిన ఒకసారి ఆమెతో ఈ విషయమై వాగ్వాదానికి దిగానని.. దాంతో ఆమె షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిందని మారుతి తెలిపారు. ఓ పాట బ్యాలెన్స్‌ ఉంది. అది పూర్తి చేయడానికి రమ్మని అడిగినా తాను వేరే సినిమాలతో బిజీగా ఉన్నానని, డేట్స్‌ ఎడ్జస్ట్‌ చెయ్యలేనని చెప్పి తప్పించుకుందని..ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్‌ చేశామని మారుతి వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+