ఆ "లేడీ డైరెక్టర్"కి గట్టిగా క్లాస్ పీకిన అల్లు అర్జున్.. కారణం అదే !!
తెలుగు చిత్రసీమలో మహిళా దర్శకుల సంఖ్య తక్కువ అనే చెప్పాలి. అయినప్పటికీ తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించి చరిత్ర సృష్టించిన దర్శకురాళ్లు ఉన్నారు. Vijaya Nirmala 46 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సృష్టించగా.. Bhanumathi Ramakrishna, Savitri, Jeevitha Rajasekhar, Sudha Kongara వంటి మహిళలు కూడా తమదైన ముద్ర వేశారు. అదే వరుసలో ఆధునిక తెలుగు సినిమాకు సున్నితమైన భావోద్వేగాలు, కుటుంబ కథలు, బలమైన మహిళా పాత్రలను పరిచయం చేసిన దర్శకురాలుగా నిలిచింది Nandini Reddy.
ఫిల్మ్ కెరీర్..
'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన నందిని రెడ్డి.. తొలి సినిమాతోనే తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. కమర్షియల్ ఫార్మాట్‌లో కూడా హృదయానికి హత్తుకునే కథలు చెప్పగల దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు వచ్చింది. Nani, Samantha Ruth Prabhu, Siddharth వంటి నటులతో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంతతో ఆమెకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా కూడా పేరుపొందారు.

అయితే కెరీర్‌లో ప్రతి దర్శకుడిలాగే నందిని రెడ్డికి కూడా ఒక కఠిన దశ ఎదురైంది. ఆమె దర్శకత్వంలో వచ్చిన Jabardasth సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా ఫలితం నందిని రెడ్డిని తీవ్రంగా కలచివేసిందట. సినిమా మీద ఎంతో నమ్మకంతో పనిచేసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఆమె మానసికంగా బాగా కుంగిపోయారని తెలుస్తోంది. మూడు నెలల పాటు బయటకు కూడా రావాలనిపించలేదని, పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని ఆమె ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.
అల్లు అర్జున్ క్లాస్..
ఈ విషయం తెలిసిన Allu Arjun వెంటనే స్పందించారట. నందిని రెడ్డిని తన ఇంటికి పిలిపించుకుని గట్టిగా క్లాస్ పీకినట్టుగా ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఇలా అయిపోతావా? ఇక బయటకు రావా? నెక్స్ట్ ఏంటి? తర్వాత సినిమా కథ ఏమిటి? ఆలోచించు... పని మొదలు పెట్టు... నేనున్నా" అంటూ బన్నీ తనకు ధైర్యం చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఒక స్టార్ హీరోగా కాకుండా నిజమైన స్నేహితుడిలా తనకు అండగా నిలిచారని, ఆ సమయంలో ఆ మద్దతు లేకపోయి ఉంటే తాను మరింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేదాన్నని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం నందిని రెడ్డి మరోసారి సమంతతో కలిసి Maa Inti Bangaram చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. .












Click it and Unblock the Notifications