ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు: నందిని రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్, ఓ బేబీ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా థియేటర్లలో సంచలన వసూళ్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న డైరెక్టర్ నందిని రెడ్డి.. సమంత ప్రెగ్నెన్సీ గురించి ఒక ఎమోషనల్, షాకింగ్ సీక్రెట్‌ను పంచుకున్నారు.

సమంత తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం తనకు చాలా రోజులు ముందే తెలుసని డైరెక్టర్ నందిని రెడ్డి వెల్లడించారు. "మా ఇంటి బంగారం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే సమంత ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలిసింది. ఆ టైమ్‌లో ఆ గుడ్ న్యూస్ సెట్‌లో ఒక్క నాకు మాత్రమే తెలుసు. వేరే ఎవరికీ ఈ విషయం లీక్ అవ్వకుండా, ఎటువంటి పుకార్లు రాకుండా మేమిద్దరం చాలా జాగ్రత్త పడ్డాం" అని నందిని రెడ్డి చెప్పారు.

Director Nandini Reddy on Samantha Pregnancy During Movie Shoot Says Only I Knew That Secret

లక్కీగా యాక్షన్ సీక్వెన్స్ ముందే పూర్తయ్యాయి!
ఈ సినిమాలో సమంత చీరకట్టులో పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లు చేసి ప్రేక్షకులను మెప్పించారు. సమంత గర్భం దాల్చే సమయానికే సినిమాకు సంబంధించిన ఓ మేజర్ టాస్క్ పూర్తయిందని నందిని రెడ్డి పేర్కొన్నారు. "లక్కీగా సమంత ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందే చిత్రానికి సంబంధించిన హెవీ యాక్షన్ సీక్వెన్స్‌లు మొత్తం షూట్ చేసేశాం. దాంతో మాకు పెద్దగా ఇబ్బంది ఎదురవలేదు. ఒకవేళ ఆ యాక్షన్ సీన్స్ బాకీ ఉండి ఉంటే మాత్రం చాలా టెన్షన్ పడాల్సి వచ్చేది" అని డైరెక్టర్ నందిని రెడ్డి అన్నారు.

షూటింగ్ ప్లాన్ మార్చాం..
యాక్షన్ సీన్లు అయిపోయినప్పటికీ మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయడం నందిని రెడ్డికి ఓ బాధ్యతగా మారింది. "సమంత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత షెడ్యూల్స్ మొత్తం రీ-ప్లాన్ చేశాం. ఆమెపై ఎలాంటి శారీరక ఒత్తిడి పడకుండా, కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తూనే మిగతా టాకింగ్ పార్ట్, సాంగ్స్ షూటింగ్‌ను చాలా సంతోషంగా, సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం" అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. నందిని రెడ్డి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఈ ఎక్స్‌క్లూజివ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+