దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..!
టాలీవుడ్‌లో త్వరలోనే మరో పెళ్లి శుభవార్త వినిపించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా డిస్కషన్ నడుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు, సింగర్ & మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రముఖ యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో డైరెక్టర్ జక్కన్న ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కీరవాణి - రాజమౌళి అన్నదమ్ములు అని తెలిసిన విషయమే.
కాగా కావ్య కళ్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె.. అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అలానే "మసూద" సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే గట్టి హిట్ అందుకుంది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తన సహజమైన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఆ తర్వాత ఆమె నటించిన "బలగం" సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు వేణు తెరకెక్కించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంతో రూపొందించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తరువాత ఆమె హీరోయిన్‌గా చేసిన "ఉస్తాద్" ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో హీరోగా Sri Simha Koduri నటించారు. ఈ సినిమా తర్వాత కావ్య కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా కనిపిస్తోంది.
ఇక కాలభైరవ విషయానికి వస్తే.. M. M. Keeravani కుమారుడిగా సంగీతంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకున్న కాలభైరవ ప్లేబ్యాక్ సింగర్‌గా ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించారు. అలాగే సంగీత దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా Karthikeya 2 వంటి సినిమాలకు సంగీతం అందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం గత కొంతకాలంగా కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన చర్చలు రెండు కుటుంబాల్లో జరుగుతున్నాయని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే నిశ్చితార్థం లేదా పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని కూడా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కాలభైరవ లేదా కావ్య కళ్యాణ్ రామ్ కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఈ వార్త నిజమైతే టాలీవుడ్‌లో మరో అందమైన జంటగా కాలభైరవ - కావ్య కళ్యాణ్ రామ్ నిలిచే అవకాశం ఉంది. ఇటీవల సినీ కుటుంబాల్లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కీరవాణి కుటుంబంలో కూడా పెళ్లి సంబరం జరగబోతుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో పెరిగింది. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications