"వారణాసి" మూవీ నుంచి బిగ్ లీక్ ఇచ్చిన రాజమౌళి తండ్రి !!
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్టోరీ ఏంటనేది రచయిత విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు.

కాగా ఈ మూవీలో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుందని గతంలో ఓ ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్వెన్స్ గురించి ప్రశ్నించగా ''రాముడికి కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం అని ఓపెన్ అయ్యారు. టైటిల్ టీజర్ లో కుంభ కర్ణుడు, రాముడు కనిపించారు కదా. ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా.. అది అద్భుతంగా ఉంటుంది'' అని తెలిపారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మరోవైపు ఈ మూవీలో మహేష్ చిన్ననాటి పాత్రలో భార్గవ్ రామ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ముద్దులొలికే ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. భార్గవ్ బాలనటుడిగా తెరంగేట్రం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.
అయితే ఎన్టీఆర్‌కు రాజమౌళి, మహేష్‌తో బలమైన అనుబంధం ఉంది. రాజమౌళి కెరీర్ 'స్టూడెంట్ నెం.1'తోనే ప్రారంభమైనందున ఎన్టీఆర్‌తో ఆయనకు విడదీయరాని స్నేహం ఉంది. మహేష్, ఎన్టీఆర్ కూడా ఒకరినొకరు సోదరుల్లా భావిస్తారు. ఈ అనుబంధాల కారణంగా ఇప్పుడు భార్గవ్ రామ్ కూడా ఇందులో భాగమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
#Varanasi - Ramayan episode is gonna be a sequence between #Ram (MB) and #Kumbhakarna - this is big reveal, can we please get April 2027 sooner or someone give me a Time Machine… @VaranasiMovie | can’t wait to see its world unfolding in #DolbyCinema | #HDR | #IMAX | #EPIQ and…
— Parth Chaturvedi (@_mrchaturvedi) June 6, 2026












Click it and Unblock the Notifications