రాజమౌళి తొలి ఫ్లాప్ మూవీ ఏదో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి గురించి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానే పరిచయం అవసరంలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. తన కెరీర్ లో ఇంతవరకు చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు వెళ్లకపోయినప్పటికీ ప్రయివేటుగా వెళ్లి ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణికి అవార్డు వచ్చేలా చేసిన ధీరుడు రాజమౌళి. సినిమా పూర్తయ్యేంతవరకు దర్శకుడిగా మాత్రమే పనిచేస్తాడు. సినిమా మొత్తం పూర్తయి మరో నెలరోజుల్లో సినిమా విడుదల కాబోతోంది అనగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మారిపోతాడు.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లా మారిపోతాడు
సినిమా ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంటాడు. దేశవ్యాప్తంగా పర్యటించి సినిమాకు కావల్సినంత ప్రచారాన్ని తీసుకురావడమేకాదు.. అలుపెరగకుండా ఇంటర్వ్యూలు ఇస్తాడు. తనతోపాటు తన హీరోలను కూడా తీసుకువెళతాడు. అలా అంతా తానై సినిమాను తీర్చిదిద్దుతాడు.. విడుదల చేయిస్తాడు.. ఇండస్ట్రీ హిట్ కొడతాడు. దీంతో అతనితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ తన నిర్మాతలను తానే స్వయంగా ఎంచుకుంటాడు. అదే రాజమౌళి గొప్పదనం. ఆర్ఆర్ఆర్ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. కానీ ప్రచారం మొత్తం చేసింది మాత్రం రాజమౌళి.

థియేటర్లలో విడుదల చేయగా ఆదరణ దక్కలేదు
ఆర్ఆర్ఆర్ సినిమా వెనక ఉన్న కష్టాలను, ఎదుర్కొన్న ఇబ్బందులను డాక్యుమెంటరీ రూపంలో తీసి ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్, అలియాభట్, కీరవాణి.. తదితరుల అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచి థియేటర్లలో విడుదల చేశారు. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ప్రేక్షకులెవరూ ఆసక్తి చూపించలేదు. దీనికితోడు పుష్ప2 హవా నడుస్తోంది. దీంతో తన కెరీర్ లోనే తొలిసారిగా థియేటర్లలో విడుదల చేసిన సినిమా వల్ల ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు రాజమౌళి. ప్రస్తుతం దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి రూ.1000 నుంచి రూ.1500 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. మహేష్ బాబు హీరో. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications