అనసూయ భర్త అనుకుని అలా చేశారు- స్టార్ దర్శకుడు

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది.

ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.

Director Sai Rajesh comments on Anasuya

38 ఏళ్ల వయస్సులో కూడా అనసూయ సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన , స్కార్ట్ వేసిన ఏం చేసిన అది అనసూయకే చెల్లింది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ కేసీఆర్ అనే సినిమాలో నటించారు. ఇటీవలే ఈ సినిమాకు ట్రైలర్ విడుదలైంది. ఈ ఈవెంట్‌లో బేబీ సినిమా ఫేం దర్శకుడు సాయి రాజేష్ అనసూయ గురించి కీలక విషయాలను బయటపెట్టారు.

ఓ సారి అనసూయతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెడితే.. ఆమె భర్తని అనుకుని నన్ను బండ బూతులు తిట్టారని చెప్పి దర్శకుడు సాయి రాజేష్ నాటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. అనసూయకు టేస్ట్ లేదా ఇలాంటి వాడ్ని చేసుకుంది అంటూ ట్రోలింగ్ చేశారట. ఈ విషయాలన్నీ నాకు తెలీదే అని అనసూయ అనేసింది. అవన్నీ నాకు గుర్తున్నాయ్ అంటూ సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+