కష్టాల్లో ఉన్న నటికి అండగా నిలిచిన సందీప్ రెడ్డి వంగా.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే ?
టాలీవుడ్ లో తనదైన స్టైల్, అగ్రెసివ్ మేకింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ అటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు "సందీప్ రెడ్డి వంగా". కేవలం మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ కల్ట్ హిట్ అందుకుని సంచలనం సృష్టించాడు. ఆ చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లో కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో చేసిన 'యానిమల్' సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో రికార్డులు తిరగరాసింది.
ప్రభాస్‌తో పాన్ వరల్డ్ మూవీ..
ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నాడు. ఇది పాన్ వరల్డ్ మూవీగా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా రూపొందనుంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మాణం జరగనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా, ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మొదట దీపికా పదుకొనే హీరోయిన్‌గా ఫిక్స్ అయినా, షెడ్యూల్ సమస్యల కారణంగా ఆ స్థానంలో 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రిను ఫైనల్ చేశారు.

అయితే ఏ అభిప్రాయమైనా నేరుగా మొహం మీదే చెప్పే సందీప్ రెడ్డి వంగాకి 'రూడ్ డైరెక్టర్' అనే ట్యాగ్ వచ్చింది. కానీ ఇది కాయిన్ యొక్క ఒక వైపు మాత్రమే.. మరో వైపు అతను సహజంగా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎవరా నటి.. ఏంటా స్టోరీ ?
ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించింది "గాయత్రి గుప్త". ఆమె ఆటోఇమ్యూన్ డిసీజ్ బారినపడి, ట్రీట్మెంట్ కోసం తన వద్ద ఉన్న మొత్తాన్ని ఖర్చు చేసానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చివరికి అద్దె కట్టుకునే డబ్బు కూడా లేక ఇబ్బందుల్లో పడ్డానని ఎమోషనల్ అయ్యింది. ఈ సమయంలో పూర్వ పరిచయంతో సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ పెట్టి తన పరిస్థితి వివరించానని.. వెంటనే రిపోర్ట్స్ పంపమని అడిగిన సందీప్.. మొత్తం 3 నెలల చికిత్స ఖర్చు ఎంత అవుతుందో అడిగాడట.

దాంతో తాను అందించిన పూర్తి వివరాలు, రిపోర్ట్స్ చూసిన ఒక వారం లోపే ఆయన రూ.5.5 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారని గాయత్రి గుప్త స్వయంగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. దీంతో సోషల్ మీడియా లో సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రికార్డులు బ్రేక్ చేసే దర్శకుడిగా మాత్రమే కాకుండా, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే హ్యూమన్ బీయింగ్‌గా కూడా ఆయన ఇమేజ్ మరింత పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications