విడాకులు తీసుకున్న కూతురు.. అసిస్టెంట్‌కు ఇచ్చి రెండో పెళ్లి చేస్తోన్న స్టార్ డైరెక్టర్
సౌత్‌లో ఇప్పుడు దర్శకుడు అంటే అందరూ రాజమౌళి గురించి చెప్పుకుంటున్నారు కానీ..ఐదారేళ్ల క్రితం వరకు స్థానంలో తమిళ దర్శకుడు శంకర్ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. శంకర్ సౌత్‌లో టాప్ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగారు. భారీ చిత్రాలకు మారు పేరుగా నిలిచారాయన. సందేశాత్మక చిత్రాలను తనదైనశైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, బాయ్స్ , జీన్స్, రోబో వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన తన స్థాయికి తగ్గట్టుగా సినిమాలు అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు, కమల్ హాసన్‌తో భారతీయుడు-2 సినిమాకు సైతం ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా దగ్గర తన పనిచేసే అసిస్టెంట్‌కు శంకర్ తన కూతుర్నిచ్చి వివాహం చేస్తున్నారు. దర్శకుడు శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో వివాహం చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఆదివారం చెన్నైలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
అయితే శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. గతంలో ఆమె పాండిచ్చేరి క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ని వివాహం చేసుకున్నారు. రోహిత్‌తో ఐశ్వర్య వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. రోహిత్‌తో విభేదాలు తలెత్తడంతో అతనికి విడాకులు ఇచ్చారు. తరుణ్ కార్తీక్‌ని ఐశ్వర్య రెండో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. తనకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతోనే తరుణ్ కార్తీక్‌కి కూతుర్ని ఇచ్చి దర్శకుడు శంకర్ పెళ్లి చేయడానికి సిద్ధమైయ్యారని తెలుస్తోంది.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications