చిక్కుల్లో 'దేవర' ..ఎన్టీఆర్ సినిమాపై దర్శకుడు శంకర్ లీగల్ యాక్షన్..?

ఎన్టీఆర్ 'దేవర' సినిమా విడుదలపై అయోమయం నెలకొంది. తాజాగా 'దేవర' సినిమాపై దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..''ఆర్ఆర్ఆర్'' సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన 'దేవర' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు.

దీనిలో భాగంగానే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. తాజాగా తమిళనాడులో సైతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. తెలుగులో సైతం యంగ్ హీరోలతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ నవల నుంచి కాపీ చేశారనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. ఈ కామెంట్స్ చేసింది మరెవరో కాదు తమిళ స్టార్ దర్శకుడు శంకర్.

Director Shankar legal action on NTR s Devara

తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని శంకర్‌ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.కాపీ రైట్స్ నిమిత్తం కేసు పెడతానంటూ శంకర్ నుంచి ప్రకటన వచ్చింది. లేటెస్ట్‌ సినిమా ట్రైలర్‌లోనూ ఓ ముఖ్యమైన సీన్‌ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్‌ సిరీస్‌.. ఇలా ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లోనైనా వినియోగించడం మానుకోండంటూ శంకర్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ చేసింది ఎన్టీఆర్ దేవర గురించే అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే ఆయన ట్వీట్ చేశారు.

Director Shankar legal action on NTR s Devara

''వెంకటేశన్‌ రాసిన ఐకానిక్‌ తమిళ నవల 'నవ యుగ నాయగన్‌ వేళ్‌ పారి' కాపీరైట్స్‌ నావే. నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాకయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్‌ను.. ఓ లేటెస్ట్‌ మూవీ ట్రైలర్‌లో చూసి కలత చెందా. నవలలోని సీన్స్‌ను సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది'' అని ఆయన హెచ్చరించారు. అయితే ఆయన ఏ సినిమా ట్రైలర్‌లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్‌ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో శంకర్ ట్వీట్ చేసింది 'దేవర' సినిమా గురించే అని అంతా భావిస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై 'దేవర' టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+