మహేష్ బాబుతో సినిమా చేసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్‌లో శ్రీను వైట్ల కూడా ఒకరు. నీ కోసం సినిమాతో దర్శకుడుగా పరిచియమైన శ్రీను వైట్ల , ఆనందం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సొంతం సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్నారు శ్రీను వైట్ల. ఢీ,రెడీ ,వెంకీ, దుబాయ్ శీను, కింగ్, నమో వెంకటేశ వరుస హిట్లను కొడుతూ స్టార్ దర్శకుల జాబితాలో చేరారాయన. ఆ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు సినిమాను తెరకెక్కించారు. పోకిరి తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న మహేష్ బాబుకు దూకుడు సినిమా సూపర్ హిట్‌ను అందించింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారు శ్రీను వైట్ల.
ఆ తర్వాత ఎన్టీఆర్‌తో బాద్‍షా సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇక్కడ నుంచే శ్రీను వైట్ల గాడి తప్పారు. దూకుడు తర్వాత మహేష్ బాబుతో శ్రీను వైట్ల ఆగడు సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల లైఫ్ లైన్లో కనిపించడమే మానేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, రవితేజ, వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికి హిట్ మాత్రం దక్కలేదు. దీంతో శ్రీను వైట్లను హీరోలు పక్కన పెట్టేశారు. ప్రస్తుతం శ్రీను వైట్ల గోపిచంద్ హీరోగా విశ్వం అనే సినిమాను తెరెక్కించారు. మరి కొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీను వైట్ల.. మహేష్ బాబు ఆగడు సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆగడు మూవీ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని ఆయన అన్నారు. ఆగడు తీసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటాను.దానికి ఒక కారణం ఉంది.దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాను.అప్పుడు ఆగడు మూవీ చేయాలనే ఆలోచనే లేదు.భారీ యాక్షన్ స్టోరీ కూడా మహేశ్ కి చెప్పాను.సూపర్ చేసేద్దామని అన్నారు.14 రీల్స్ సంస్థ నిర్మాతలకు కూడా కథ నచ్చింది.కానీ వాళ్లంత బడ్జెట్ పెట్టలేమని అన‍్నారు.అప్పట్లో వాళ్లకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.దీంతో ఆ కథని పక్కనబెట్టి ఆగడు చేశాం.అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటాను అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications