మీరు మారరా ??.. "సుజిత్ క్యాస్ట్" గురించి ఫుల్ సెర్చ్.. మన కులపోడే అంటూ పోస్టులు !!

సుజిత్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ పేరు మారు మోగుతుంది. తీసింది మూడంటే.. మూడు సినిమాలు అయినప్పటికీ తానంటే ఏంటో నిరూపించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన ఈ కుర్రాడు.. ఇప్పటికే రన్ రాజా రన్, సాహో చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన "ఓజీ' ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ యంగ్ దర్శకుడి గురించి మరోసారి హాట్ డిస్కషన్ నడుస్తోంది.

అయితే ప్రపంచంలో ఎవరికైనా ఈ రకమైనా ఫీలింగ్ ఉంటుందో లేదో తెలియదు కానీ మన తెలుగు వాళ్లకు మాత్రం ఉంటుంది. అదే క్యాస్ట్ ఫీలింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన అభిమానం పీక్స్ లో ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. ఒక వ్యక్తి ఏదైనా సాధించడం ఆలస్యం.. అతను క్యాస్ట్ ఏంటి.. ఏ వర్గం అంటూ వెతకడం ప్రారంభించేస్తారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సుజిత్ క్యాస్ట్ ఏంటి అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

director-sujith-caste-searching-top-on-google-and-social-media-posts

గూగుల్ సెర్చ్ లో టాప్..

సాధారణంగా ఎవరైనా కాస్త పేరు తెచ్చుకుని.. సాధిస్తున్నాడు అంటే.. వెంటనే కొన్ని తోక సంఘాలు వెలుగు లోకి వచ్చేస్తాయి. సదరు వ్యక్తి మావాడే.. మా కులపోడే అంటూ తెగ మాట్లాడేస్తుంటారు. నిన్నటి వరకూ ఏమైపోయారో ఏమో కానీ.. ఓజీ సినిమా సినిమా హిట్ తో.. సుజీత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో.. అతని పేరు చివరని నిన్నటి వరకూ కనిపించని విషయాన్ని ఇప్పుడు వెతకడం ప్రారంభించేస్తున్నారు. సుజీత్ కులాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు.

సుజీత్ బ్యాగ్రౌండ్..

1990లో శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం డబరు వారిపల్లెలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు సుజీత్. అతని పూర్తి పేరు సుజీత్ రెడ్డి. టెన్త్ వరకూ అనంతపురంలోనే చదువుకుని.. ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ వచ్చేశాడు. ఆ తర్వాత ఛార్టెడ్ అకౌంట్ చదుదామని సిటీకి వచ్చి సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఆ ఆసక్తితోనే హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చి.. ఎల్ వి ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో డిగ్రీ చేశాడు.

17 ఏళ్లకే తొలి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి దాదాపు 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత సినిమా ఛాన్స్ రావడం.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో "రన్ రాజా రన్" సినిమా చేసెయ్యడం జరిగిపోయాయి. నాలుగు కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ప్రభాస్ ‌తో చేసిన సాహో.. సైతం కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

director-sujith-caste-searching-top-on-google-and-social-media-posts

వివాహం..

సుజీత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది. ప్రవళిక హైదరాబాద్ లోనే టాప్ డెంటిస్ట్ అని తెలుస్తోంది.

మొత్తానికి ఇప్పుడు మరోసారి ఆ డైరెక్టర్ మా కులపోడు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు సైతం పెట్టేస్తున్నారు. ఇన్నాళ్లు లేని కులం రంగును కొత్తగా ఆపాదిస్తూ హైలైట్ చేసేస్తున్నారు. ఈ వ్యవహారం చూసి మన తెలుగు వాళ్లకి ఈ కుల పిచ్చి ఎప్పటికీ తగ్గుతుందో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+