ఆ హీరో చెప్పినవన్నీ సోది, పచ్చి అబద్ధాలు నమ్మొద్దు.. తేజ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తేజ. ఒకప్పుడు వరుస ప్రేమకథలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించినప్పటికీ.. ఆయన మాటలు మాత్రం ఎప్పుడూ పవర్‌ఫుల్ గానే ఉంటాయి. తాజాగా తేజ తన కెరీర్, మహేష్ బాబుతో సినిమా, మరియు తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోల డేట్లు దొరకడం అంత సులభం కాదని, అందుకే తాను మీడియం లేదా చిన్న బడ్జెట్ చిత్రాలనే ఎంచుకుంటానని తేజ స్పష్టం చేశారు. మహేష్ బాబుతో తీసిన 'నిజం' గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో మహేష్ 'బాబీ' వంటి ఫ్లాప్‌లో ఉన్నారు. అందుకే నాకు అవకాశం దొరికింది. బి.ఏ. రాజుగారి చొరవతోనే ఆ సినిమా సెట్ అయ్యింది. నేను ఎప్పుడూ హిట్‌లో ఉన్న స్టార్ల వెంట పడను, అవకాశాల కోసం ఎవరినీ అడగనని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

Director Teja Sensational Comments on Mahesh Babu and JD Chakravarthy

తన ప్రేమకథ గురించి నటుడు జేడీ చక్రవర్తి గతంలో చెప్పిన విషయాలను తేజ పూర్తిగా ఖండించారు. జేడీ చెప్పినవన్నీ సోది, పచ్చి అబద్ధాలు అని కొట్టిపారేశారు. తన పెళ్లిని అక్కినేని వెంకట్ గారు, జ్యోత్స్న అక్కినేని గారు నిశ్చయించారని, నాగేశ్వరరావు గారి కోడలు జ్యోత్స్న గారు తన పెళ్లి పెద్దగా వ్యవహరించారని క్లారిటీ ఇచ్చారు.

తన కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను కూడా తేజ గుర్తు చేసుకున్నారు. పెళ్లి ఫిక్స్ అయినప్పుడు నాకు సొంత ఇల్లు, కారు ఏమీ లేవు. అన్నపూర్ణ స్టూడియోస్ కాటేజ్‌లోనే ఉండేవాడిని. జ్యోత్స్న గారు సలహా ఇస్తే.. పెళ్లికి వారం రోజుల ముందు అద్దె ఫ్లాట్ తీసుకుని, ఐదు రోజుల ముందు కారు కొన్నానని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

తన వారసుడు సినీ రంగ ప్రవేశం గురించి చెబుతూ.. తన కొడుకు అమెరికాలో దర్శకత్వ కోర్సు పూర్తి చేశాడని, ప్రస్తుతం హీరోగా పరిచయం కావాలని ఆసక్తి చూపిస్తున్నాడని తెలిపారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి నిర్మాతగా మారాలనే లక్ష్యంతో ఉన్నట్లు తేజ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+