యంగ్ హీరోతో జత కట్టిన టాలెంటెడ్ డైరెక్టర్.. మరో హిట్ పక్కా..!

దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత వరుస హిట్ల కొడుతున్న దర్శకుల లిస్ట్‌లో త్రినాధ రావు నక్కిన ఒకరు. ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే.కెరీర్ తొలినాళ్లలో రచయితగా పని చేసిన త్రినాధ రావు ఆ తర్వాత దర్శకుడిగా మారారు. మేము వయసుకు వచ్చాం సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. తీసిన తొలి సినిమాతోనే ఆయన బ్లాక్ బ్లాస్టర్ కొట్టారు. ప్రేమ కథను వినూత్నంగా చూపించడంలో త్రినాధ రావు తన మార్క్ చూపించారు.

ఆ తర్వాత సినిమా చుపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారాయన. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా మజాకా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాజిటిక్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను కూడా తనదైన శైలిలో వినోదాత్మకంగా తెరకెక్కించారు త్రినాధ రావు.

Director Trinadha Rao Nakkina has started shooting for his next film

వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేసాడు. ఈసారి, అతను ఒక హై-ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం ప్రామిసింగ్ యువ హీరో హవీష్ కోనేరుతో జతకట్టాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో త్రినాధ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవీష్ తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాను ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సెట్స్ పైకి వెళ్ళిడట. మంచి ముహూర్తం చూసుకుని అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది..

నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు, త్రినాథరావు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. కాగా నువ్విలా సినిమాలో హావిష్ కామెడి టైమింగ్ ఆకట్టుకుంది. ఆ నేపథ్యంలో రైటర్ బెజవాడ ప్రసన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కధను రెడీ చేసాడట. హవీష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మెుదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+