సైజ్‌లు ఎక్కువుండాలి! హీరోయిన్‌పై డైరెక్టర్ అనుచితం, అల్లు అర్జున్‌పై సెటైర్!!

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మజాకా' సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఆ సినిమా హీరోయిన్ అన్షు అంబానీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లతోపాటు సినీ అభిమానులు దర్శకుడిపై మండిపడుతున్నారు. మహిళా నటిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మజాకా సినిమా టీజర్ విడుదల వేడుకలో త్రినాథరావు మాట్లాడుతూ.. మాజాకా నాకు చాలా ఇష్టమైన కథ. సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన్మథుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. మేము ఎప్పుడో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.. మన్మథుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో బొద్దుగా ఆకట్టుకున్న అలాంటి అమ్మాయి ఒక్కసారిగా కళ్ల ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా. ఇప్పటికీ అలాగే ఉందా.. కొంచెం సన్నబడింది. దీంతో నేనే చెప్పా.. కొంచెం తిని పెంచమ్మా అని అన్నారు దర్శకుడు త్రినాథరావు.

Director Trinadha Rao s inappropriate comments on heroine Anshu

అంతేగాక, తెలుగుకు అన్నీ కొంచెం ఎక్కువ సైజులోనే ఉండాలని చెప్పా.. పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయినట్లుంది అని త్రినాథరావు వ్యాఖ్యానించారు. కాగా, త్రినాథరావు కావాలనే చేశారో.. కామెడీ కోసం చేశారో కానీ ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అప్పట్లో అక్కినేని నాగార్జున సరసన అన్షు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుమారు 23 ఏళ్లకు మళ్లీ ఆమె తెలుగు సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

మరోవైపు, అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేసినట్లు త్రినాథ రావు వ్యవహరించడం కూడా ఈ సందర్భంగా హాట్ టాపిక్‌గా మారింది. సెకండ్ హీరోయిన్ పేరు.. (మర్చిపోయిన్టలుగా) అంటూ తాగడానికి నీళ్లు అడిగారు. ఆ తర్వాత రీతూ.. రీతూ.. రీతూ వర్మ అని చెప్పారు. కరెక్టు కదా అంటూ నవ్వారు. గతంలో అల్లు అర్జున్ కూడా తన సినిమా పుష్ప-2 కార్యక్రమంలో ఇలానే చేయడం గమనార్హం. దీంతో అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసి ఇలా చేశారా? అని చర్చించుకుంటున్నారు.

సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు తెరకెక్కిస్తన్న సినిమాలో హీరోయిన్‌లుగా అన్షు, రీతూ వర్మ నటించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ సినిమా టీచర్‌ను లాంచ్ చేశారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+