తెలుగు టాప్ డైరెక్టర్ తో సూర్య సినిమా?

తెలుగు, తమిళంతోపాటు దేశవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్న నటుడు సూర్య. రెగ్యులర్ ఉండే కథలను ఎంచుకోకుండా ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించడమేకాదు.. స్టార్ హీరోగా తన స్థానం చెక్కుచెదరకుండా చూసుకుంటూ వస్తున్నారు. అందువల్లే ఆయన నుంచి శివపుత్రుడు, గజిని, జైభీమా లాంటి సినిమాలు వచ్చాయి.. కంగువ లాంటి విశిష్టమైన చిత్రం కూడా రాబోతోంది.

కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు దర్శకులతో సినిమా చేయడానికి సూర్య ప్రయత్నిస్తున్నారుకానీ కుదరడంలేదు. ఇటీవలే బోయపాటి శ్రీనుతో చేస్తారనుకున్నారుకానీ దానికి ఆలస్యంపట్టే అవకాశం ఉంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూర్య సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ తీర్చిదిద్దిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదటిరోజు మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. మహేష్ బాబుకు మూడోసారి కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాడంటూ ప్రిన్స్ అభిమానులు త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు.

director trivikram srinivas and hero surya combination movie

ఈ సినిమాలో కనీసం త్రివిక్రమ్ తరహా డైలాగ్ ఒక్కటి కూడా లేదు. అల్లు అర్జున్ తో ఓ భారీ చిత్రం చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రం చేయాల్సి ఉంది. దానికంటే ముందు ఇది చేస్తాడా? లేదంటే దీనికంటే ముందు అది చేస్తాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాకు ముందు సూర్యతో చిత్రం చేయాలా? తర్వాత చేయాలా? అనే సందేహంలో త్రివిక్రమ్ ఉన్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ నుంచి పూర్తిస్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. గుంటూరు కారం ఫ్లాప్ ప్రభావం పడిందేమో అంటున్నారు.

విభిన్నమైన కథలతో యాక్షన్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న సూర్య జోనరల్ లోకి త్రివిక్రమ్ వస్తాడా? లేదంటే త్రివిక్రమ్ జోనర్ లోకి సూర్య వస్తాడా? అనేది సినిమా వస్తేకానీ తెలియరాదు. అప్పటివరకు వేచిచూడటమే. ఏదన్నాకానీ గురూజీకి గుంటూరు కారం మాత్రం పెద్ద మైనస్ గా మారింది. తర్వాత సినిమాను ఏ జోనర్ లో, ఎంత కసితో తీస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+