సూర్య, యష్ తో త్రివిక్రమ్ మల్టీస్టారర్?
తెలుగు సినీ పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. మంచి దర్శకుడిగా మారారు. మొన్న సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా ఫ్లాపవడంతో త్రివిక్రమ్ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కనీసం అతని తరహాలో ఒక్క పంచ్ డైలాగ్ కూడా లేదని, ఇతరుల సినిమాలకు పనిచేయడం, వాటిమీదే దృష్టిసారించడంలాంటివి చేయడం మానుకోవాలంటూ మహేష్ బాబు అభిమానులు ట్రోలింగ్ చేశారు.
గుంటూరు కారం సినిమాతో తనకు వచ్చిన చెడ్డపేరును తొలగింపచేసుకోవాలనే ధ్యేయంతో త్రివిక్రమ్ ఉన్నారు. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అట్లీ సినిమాకన్నా ముందు వస్తుందా? తర్వాత వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇతర స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే కాస్త వెనకబడ్డారు. దీంతో ఆయన తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలనుకుంటున్నారు. తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. సూర్యతో గతంలోనే త్రివిక్రమ్ ఓ సినిమా తీయాల్సి ఉంది. అనుకోని కారణాలవల్ల అది వెనక్కి పోయింది.

ప్రస్తుతం వీరి కాంబోలో రాబోతున్న సినిమాలో మరో హీరోకు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో ఘనవిజయం సాధించిన యశ్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే త్రివిక్రమ్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఆయన మార్కెట్ పడిపోయే అవకాశం ఉందంటున్నారు. చివరకు ఏ స్టార్ హీరో కూడా త్రివిక్రమ్ కు సినిమా ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చంటున్నారు. దీంతో కచ్చితంగా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత త్రివిక్రమ్ పైనే ఉంది.












Click it and Unblock the Notifications