నిర్మాతను మోసం చేసిన నితిన్..? వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు నితిన్. అయితే నితిన్‌కు రావాల్సిన పేరు ఇంకా రాలేదని అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది.
నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. 'భీష్మ' తరువాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి సినిమా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ ప్రస్తుతం 'రాబిన్ హుడ్' అనే సినిమాలో నటించాడు. తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కడుములనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది.

ఇదెలా ఉంటే నితిన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నితిన్ ఓ నిర్మాత దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారనేది ఈ వార్త సారాంశం. దీనిపై అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.బింబిసారా సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి హీరో నితిన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తొమ్మిదేళ్ల క్రితం తన కొడుకు దర్శకుడిగా, తాను నిర్మాతగా నితిన్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశామని, దానికి అనుగుణంగానే నితిన్‌కి రూ.75 లక్షలు అడ్వాన్స్, కెమెరామెన్ ఛోటా కే.నాయుడు గారికి రూ.10 లక్షలు కూడా ఇచ్చామని మల్లిడి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. అయితే వశిష్ట తెచ్చిన కథ నితిన్‌కు నచ్చకపోవడంతో.. వేరే కథ రాయించుకుని వశిష్టను డైరెక్టర్‌గా చేయమన్నారు.
ఇదే సమయంలో నితిన్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన "అ ఆ" హిట్ కావడంతో నితిన్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో అతను కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదని మల్లిడి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. దీంతో ఆ ప్రొజెక్ట్ ఆగిపోయింది. అప్పటికే ఆ ప్రొజెక్ట్ పై వశిష్ట తండ్రి అక్షరాల రూ.2 కోట్లు ఖర్చుపెట్టానని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత అల్లు శిరీష్‌తో సినిమా తీయడానికి ప్రయత్నించిని అది కూడా పట్టాలెక్కలేదని సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చాడు. మల్లిడి వశిష్ఠ జీవితంలోకి ఊహించని విధంగా కల్యాణ్ రామ్ రావడం ,ఆయనతో బింబిసార సినిమా తీయడం జరిగిందని ఆయన తండ్రి వెల్లడించారు.ఇక బింబిసార ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటు కళ్యాణ్ రామ్‌ను, ఇటు వశిష్టను స్టార్‌లను చేసింది. వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నితిన్‌పై వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి ఆరోపణలు చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications