ఉపాసనకు ప్రముఖ దర్శకుడు లైంగిక వేధింపులు
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి.
కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులను బయటపెట్టింది. ఉపాసన సింగ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ..బాలీవుడ్ ప్రేక్షకులకు సుమారు ఉపాసన సింగ్ సుపరిచితురాలే.

సుమారు 40 ఏళ్ల కిందట 'జుదాయి'అనే సినిమాతో ఉపాసన సింగ్ ఇండస్ట్రీకి పరిచియం అయింది. తన మొదటి సినిమాలోనే ద్విపాత్రాభినయంలో నటించి అలరించింది. ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరించింది. ఓ దర్శకుడు హీరో అనిల్ కపూర్ సరసన హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానని చెప్పాడని..ఆ తరువాత హోటల్‌కు రమ్మని పిలిచాడని తెలిపింది.
రేపు వస్తానని చెప్పడంతో అయితే కారు పంపిస్తానని చెప్పడంతో నేరుగా ఆయన ఉద్దేశం అర్థం అయిందని ఉపాసన సింగ్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ దర్శకుడిని మందలించానని..నువ్వు మా నాన్న వయసులో ఉన్నావని, నా గురించి ఇలా ఎలా ఆలోచించావంటూ అడిగానని.. ఈ ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదని.. ఏడుస్తూనే ఉన్నానని చెప్పింది. అప్పటికి నా వయస్సు 17 సంవత్సరాలే ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఉపాసన సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications