విదేశాల్లో భార్య..ఆ హీరోయిన్‌తో దుకాణం పెట్టేసిన దర్శకుడు..?
ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరూ తప్పించుకోలేని రెండు అట్రాక్షన్లు ఉంటాయి. ఒకటి డబ్బు ,రెండవది అమ్మాయి. ఎంతవారు గానీ వేదాంతులైన గానీ ఓర చూపు చూడగానే పడిపోవడం ఖాయం. ఇక సినీ ఇండస్ట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి.
బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకర్ని వివాహం చేసుకున్నా వారే. తాజాగా ఓ తెలుగు దర్శకుడు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ బిగ్ డిజాస్టార్ అందుకున్న దర్శకుడు, ఓ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. భార్య విదేశాల్లో సెటిల్ కావడంతో సదరు దర్శకుడు ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆ హీరోయిన్ గతంలో పలు సినిమాల్లో నటించింది.

అయితే ఆ సినిమాలు ఏవీ కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. గ్లామర్ ఒలకబోస్తూ స్టిల్స్ వదుల్తూ ఉన్నా పెద్దగా పట్టించుకున్న వారు లేరు. దీంతో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సదరు దర్శకుడితో ఆ హీరోయిన్ సర్దుకుపోయిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దర్శకుడితో సహజీవనం పుణ్యమా అని ఒక సినిమాలో చిన్న పాత్ర అఫర్ కూడా దొరికింది. ఈ ఏడాది ఏదో అలా అలా మూడు నాలుగు సినిమాల్లో నటించింది. గడచిపోయింది. వచ్చే ఏడాది సినిమాలు ఉంటాయో, కేవలం సహజీవనంతోనే సరిపోతుందో చూడాలి.












Click it and Unblock the Notifications