'పుష్ప2' బిజినెస్‌ను భారీగా దెబ్బతీస్తున్న 'దేవర'?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప2. పుష్ప1 చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు రెండో భాగంపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ చెక్కుతూనే ఉన్నారు. విడుదల విషయంలో వాయిదాలు పడుతూ వచ్చిన పుష్ప2 ఎట్టకేలకు డిసెంబరు ఆరోతేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపే అవకాశం ఉందంటున్నారు.
పుష్ప1 తెలుగులో విజయం సాధించలేదు
వాస్తవానికి పుష్ప1 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఒక్క హిందీలోనే రూ.100కోట్లకు పైగా వసూలు చేసి ఘనవిజయం సాధించింది. దీంతో రెండో భాగంద్వారా హిందీ నుంచి రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాలని నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే తెలుగులో పుష్ప1 అనుకున్నస్థాయిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనుగోలుకు ముందు, వెనక ఆడుతున్నారు. ఏపీకి చెందిన మంత్రి ఒకరికి మైత్రీ మూవీ మేకర్స్ తో మంచి అనుబంధం ఉండటంతో టికెట్ ధరలు పెంచుకోవడానికి సులువుగానే అనుమతులు వస్తాయి. అయినా బయ్యర్లు మాత్రం ముందుకు రావడంలేదు.

ఎన్టీఆర్ బాగా లాక్కొచ్చారు
ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చిన దేవర చిత్రానికి టాక్ మిశ్రమంగా వచ్చినప్పటికీ తారక్ మాస్ ఫాలోయింగ్ వల్ల కలెక్షన్లు దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే రూ.500 కోట్ల గ్రాస్ ను దాటింది. విజయ దశమి సెలవులను ఈ సినిమా చక్కగా ఉపయోగించుకుంది. ఆర్ఆర్ఆర్ కు మించి ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు సాధిస్తోంది. టాక్ మిశ్రమంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా ఎన్టీఆర్ సినిమాను లాక్కొచ్చి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించారు. అదే పని అల్లు అర్జున్ చేయగలరా? అని బయ్యర్లు సందేహిస్తున్నారు.
అల్లు అర్జున్ లాక్కురాగలరా?
సినిమాకు ఏమాత్రం బాగోలేదని టాక్ వచ్చినా, మిశ్రమంగా టాక్ వచ్చినా దేవర తరహాలో అల్లు అర్జున్ సినిమాను లాక్కువస్తారా? అనే సందేహం డిస్ట్రిబ్యూటర్లను వెంటాడుతోంది. మాస్ ఫాలోయింగ్ తారక్ తో పోలిస్తే బన్నీకి తక్కువ అని అంటున్నారు. హిందీ, తమిళం, మళయాళం, కన్నడం సంగతి ఎలావున్నా తెలుగు సంగతి ఏమిటనేది నిర్మాతలకు కూడా అంతుపట్టడంలేదు. సినిమాకు అంచనాలకు మించి ఖర్చుపెట్టారు. దాన్ని రాబట్టుకోవడానికి థియేట్రికల్ హక్కులను భారీస్థాయిలో చెబుతున్నారు. ఇంతవరకు వారితో నిర్మాతలకు డీల్స్ కుదర్లేదు. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వెళ్లడంతోపాటు పోటీగా ఏ సినిమాలు లేవని, కచ్చితంగా భారీ కలెక్షన్లు వస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. బిజినెస్ ఎంతవరకు జరుగుతుందో, ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications