అవును.. వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారట..!!
సెలబ్రిటీల విషయంలో ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు కామన్ అయిపోతున్నాయి. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధిపతి, సినీ నటుడు పవన్ కల్యాణ్.. ఆయన సతీమణి అన్నా లెజినోవా తమ వివాహ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నవంబర్ 9 న సోమవారం రాత్రి ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ జీవితంలో ఓ ముఖ్యమైన భాగాన్ని కలిసి పంచుకున్న తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే తమ వివాహబంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా.. తమ పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతాం.. అలాగే మా పిల్లల ఆనందం, శ్రేయస్సు ఎప్పటికీ మా ఉమ్మడి ప్రాధాన్యాల్లో భాగంగానే ఉంటుందని పవన్ కల్యాణ్- అన్నా లెజినోవా సంయుక్తంగా పేర్కొన్నారు. అయితే పవన్ కల్యాణ్ విడాకుల అంశం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మరో విడాకుల వార్త బయటకు రాబోతోందా..? అనే ప్రశ్న ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఏడాది విజయాన్ని అందుకున్న ఓ ప్రముఖ మహిళా సెలబ్రిటీ ఇప్పటికే పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె తన విడాకుల విషయాన్ని మాత్రం బయటపెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈ వ్యవహారంపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందా..? లేక రహస్యంగానే మిగిలిపోతుందా..? అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.

ఇక అంతకుమందు టాలీవుడ్ లో సమంత- అక్కినేని నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ దంపతులు కూడా డివోర్స్ తీసుకున్నారు. అటు కోలీవుడ్ లో ధనుష్ అండ్ ఐశ్వర్య రజనీకాంత్ కపుల్స్ కూడా విడిపోయారు.












Click it and Unblock the Notifications
