'జులాయి' సినిమాలో దొంగతనం చేసి వెంటనే దొరికిపోయే దొంగలా సీఎం చంద్రబాబు AEI అబద్దాలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ పేరుతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 'జులాయి' సినిమాలో చిన్న దొంగతనం చేసినా వెంటనే దొరికిపోయే బ్రహ్మానందం పాత్రలా కూటమి నేతల అబద్ధాలు, మోసాలు ప్రజలకు ఇట్టే దొరికిపోతున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఓపీ జిందాల్ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన CNES స్కాలర్స్ గత నాలుగేళ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ఏఈఐ నివేదికను రూపొందించారన్నారు.
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ చంద్రబాబు ను టార్గెట్ చేసి చంద్రబాబు పాలనలో 2014-19 కాలానికి సంబంధించి... 2021 లో ఇచ్చిన నివేదికలో 10వ స్థానంలో ఉన్న ఏపీ ర్యాంకును, జగన్ తమ పాలనలో 3వ స్థానానికి తీసుకొచ్చారని ఈ ఘనత జగన్ దే అన్నారు . విద్యా రంగంలో 'నాడు-నేడు' ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చి పాఠశాలల్లో అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత వైయస్ జగన్ దే అన్నారు. ప్రజా వైద్యంలో ఆరోగ్యశ్రీ, ఆసరా, 'నాడు-నేడు' కింద కొత్త మెడికల్ కాలేజీలు, 50 వేల నియామకాలతో కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అని గుర్తు చేశారు.

జగన్ హయాంలో కల్పించిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఫలితంగానే ఈరోజు రాష్ట్రం ఏఈఐ ఇండెక్స్‌లో 2వ స్థానానికి చేరింది. గత రెండేళ్ల జగన్ గారి పాలన పనితీరును చూపిస్తూ... తామేదో పొడిచేసినట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి పాలనలో స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ ఏకంగా -3.2% మేర క్షీణించి పడిపోయిందన్నారు.
కూటమి ప్రభుత్వంలో ప్రతి రోజూ సగటున రూ.460 కోట్ల అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు.రాష్ట్రంలో పుట్టబోయే పసిబిడ్డతో సహా ప్రతి పౌరుడిపై కూటమి ప్రభుత్వం రూ.2,11,588 ల అప్పు భారాన్ని మోపిందన్నారు. చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే రాబోయే రెండేళ్లలో ప్రతి వ్యక్తిపై అప్పు ఏకంగా రూ.5 లక్షలకు చేరే ప్రమాదం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జగన్ హయాంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటే, నేడు 8వ స్థానానికి దిగజార్చారన్నారు.
పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా జగన్ అనుమతులిస్తే, నేడు 'బాబు సన్ టాక్స్' ల దందాతో పవర్ ఇండస్ట్రీలు రాత్రికి రాత్రే పారిపోతున్నాయన్నారు. కూటమి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్తా 'లాస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గా మారిపోయిందన్నారు. లేబర్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 14.6% ఉంటే, మన రాష్ట్రంలో ఏకంగా 21 శాతంతో దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు.
2014-19 మధ్య డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేసి సంఘాలను డీ-గ్రేడ్ చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నాడు నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు జగన్ రూ.20 వేల కోట్లు చెల్లించి ఆదుకుంటే, నేడు చంద్రబాబు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారన్నారు . సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఏడాదికి కనీసం రూ.1,19,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కనీసం పదుల కోట్లు కూడా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు.
భోగాపురం, పోలవరం, రాజధాని ప్రాంతాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలుపును చూసి తట్టుకోలేకే క్వాంటం, ఏఐ, ఏఈఐ అంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. కురుక్షేత్రంలో ధర్మరాజు 'అశ్వత్థామ హతః కుంజరః' అంటే, నేడు చంద్రబాబు 'అధర్మరాజు'లా వాస్తవాలను దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications
