ఏపీపై మరో అల్పపీడనం-బంగాళాఖాతంలో తాజా అప్డేట్..!

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య ప్రకృతి (Weather) పగబట్టినట్లే వ్యవహరిస్తోంది. ఇప్పటికే గత ఆరు నెలలుగా ఎండలు, ఎల్ నినో ప్రభావం, వర్షపాత లోటుతో సతమతం అవుతున్న ప్రజలకు తాజాగా వరుసగా రెండు తుఫాన్లు వచ్చి ఆ కష్టాలు మరింత పెంచాయి. ఇప్పుడు వాటి నుంచి కోలుకుంటున్న తరుణంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటన మరో షాక్ ఇచ్చేలా ఉంది. ఈనెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్ద తెలిపింది.

ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!
ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!

ఈనెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం .. అక్కడి నుంచి 24 గంటల్లో బలమైన అల్పపీడనంగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్ద తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 14, 15 తేదీల్లో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి వల్ల గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఈ నెల 14, 15 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Weather Alert Low-Pressure Area Expected Over Bay of Bengal on November 13 Strong Winds Likely
పవన్ విడాకుల వ్యవహారం..! క్యాడర్ కు టీడీపీ, వైసీపీ కీలక ఆదేశాలు?
పవన్ విడాకుల వ్యవహారం..! క్యాడర్ కు టీడీపీ, వైసీపీ కీలక ఆదేశాలు?

మరోవైపు బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడి అది బలపడి తుఫానుగా కోస్తా తీరం కి రావడానికి 8-10 రోజులు సమయం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది తమిళనాడు కి వెళ్తుందా లేక ఆంధ్ర ప్రదేశ్ కి వస్తుందా అనేది ఇంకో 5-6 రోజుల్లో తెలుస్తుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏర్పడ్డ వాయుగుండాలు లేదా అల్పపీడనాలు తీరం వద్దకు రాగానే ఉత్తర దిశకు వెళ్లాయి కాబట్టి ఇది కూడా ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగానే వున్నాయని విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ అల్పపీడనం ప్రమాదకరమా కాదా అన్నది తేలాలంటే మరో ఐదారు రోజులు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+