అనంతపురం మేయర్‌ టీడీపీలోకి రావాలి.. లేకుంటే జరిగేదిదే: జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం నగరం నిజంగా అభివృద్ధి చెందాలంటే మేయర్ రమేష్ గౌడ్ టీడీపీలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. తాను గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న రోజుల్లో అధికారులు తన మాట పట్టించుకోకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డానో అనుభవించానని, అందుకే ఇప్పుడు మేయర్‌కు ఈ సలహా ఇస్తున్నానని ఆయన వివరించారు. అధికార పార్టీలో ఉంటేనే కమిషనర్ సహా అధికారులు వినిపించుకుంటారని, లేకపోతే నగరానికి అవసరమైన నిధులు సకాలంలో రావని హెచ్చరించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయని, కుప్పం మున్సిపాలిటీలో తమిళనాడు నుంచి జనాలను తెచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అభ్యర్థులను కిడ్నాప్ చేశారని కూడా పేర్కొన్నారు.

JC Prabhakar Reddy Calls Anantapur Mayor to Join TDP Strongly Criticises Ananta Venkatramireddy

అలాంటివారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును వైసీపీ నేతలు చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక రప్పా రప్పా నరికేస్తామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో మళ్లీ ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ధైర్యముంటే ఆ మండలాల్లో కాలు పెట్టి చూడాలని సవాలు విసిరారు.

అనంత వెంకట్రామిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే అనంతపురం పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అంటున్నవారు ముందుగా వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సూచించారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. 13 కార్పొరేషన్లలో 12 చోట్ల మేయర్ పదవులు దక్కించుకుంది. అయితే అనంతపురం కార్పొరేషన్‌లోనే వైసీపీ మేయర్ పదవిని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వైద్యారోగ్య శాఖలో భారీ ఉద్యోగాల జాతర.. దశలవారీగా నోటిఫికేషన్లు, గెట్ రెడీ!
వైద్యారోగ్య శాఖలో భారీ ఉద్యోగాల జాతర.. దశలవారీగా నోటిఫికేషన్లు, గెట్ రెడీ!

తాడిపత్రిలో ఆయన ఇటీవల ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత తప్పులకు క్షమాపణలు కోరుతూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కార్యకర్తలను కోరారు. అనంతపురం నగరం అభివృద్ధికి అన్ని పక్షాలు కలిసి పని చేయాలని, రాజకీయ వైరాలను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రాధాన్యం కావాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+