900 కోట్లు ఇస్తే విడాకులు ఇస్తా.. స్టార్ హీరోయిన్ సంచలనం

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.

భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

divorce rumours from Jennifer Lopez Ben Affleck

తాజాగా ఈ జాబితాలో హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్‌ జెన్నిఫర్ లోపెజ్ పేరు కూడా వినిపిస్తోంది. జెన్నిఫర్ లోపెజ్ తన భర్తతో విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన ఈ నటి త్వరలోనే తమ బంధానికి గుడ్‌ బై చెప్పడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జెన్నిఫర్‌ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. తాజాగా తమ బంధానికి ఈ జంట ఎండ్ కార్డ్ వేయడానికి సిద్ధమవుతోంది.

2021లో డేటింగ్‌ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. బెన్ అఫ్లెక్ - లోపెజ్ చివరిసారిగా మార్చి 30న కలిసి కనిపించారు. ఈ జంట‌ నెల క్రితమే విడాకుల పత్రాలను ఖరారు చేశారు.. కానీ దానిని ప్రకటించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్‌ తీసుకోబోతున్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. జెన్నిఫర్ లోపెజ్ తన భర్తను భరణం కింద 900 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది.బెన్ ఆస్తి మొత్తం 1800 కోట్లు ఉంటే అందులో నుంచి సగం అంటే 900 కోట్ల భరణం జెన్నిఫర్ కోరుతుంది. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారంగా ఇది నమోదు కాబోతోంది.మరోవైపు జెన్నీఫర్‌కు ఆస్తి కూడా తక్కువేమి లేదు. ఆమె ఆస్తి విలువ దాదాపుగా 500 మిలియన్ డాలర్లు ఉండవచ్చనే అంచనాలున్నాయి. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు రూ.4000 కోట్లు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న జెన్నిఫర్, ముచ్చటగా ఐదోసారి విడాకులకు రెడీ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+