రీతూ చౌదరి ఎఫైర్స్‌పై దివ్వెల మాధురి సంచలన కామెంట్స్
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు దక్కాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని రీతూ చౌదరి వినియోగించుకుంది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ సీజన్‌లో అడుగుపెట్టింది.

రీతూ చౌదరి బిగ్ బాస్‌లో ఉండగానే ఆమెపై ఎఫైర్ ఆరోపణలు వినిపించాయి. హీరో ధర్మ మహేష్‌తో రీతూ చౌదరితో ఎఫైర్ పెట్టుకుందని ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్ చేశారు. పలు యూట్యూబ్ ఛానెల్స్‌తో ఆమె మాట్లాడుతూ..తన భర్త రీతూ చౌదరితో రిలేషన్ పెట్టుకున్నారని తెలిపింది. గౌతమి షేర్ చేసిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్స్‌లో, రీతూ గురించి అడగడం వల్లే తన భర్త దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది.దీని తర్వాత, రీతూ చౌదరి , ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్తున్న వీడియోలను కూడా గౌతమి షేర్ చేసింది. దీంతో పాటు రీతూ చౌదరితో తన భర్త బెడ్ రూమ్ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని , అవసరం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని ధర్మ మహేష్ భార్య గౌతమి చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్ దివ్వెల మాధురి, హౌస్‌లోకి వెళ్లే ముందు ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై బలంగా మాట్లాడారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు మాధురి స్పందిస్తూ.. రీతూ చౌదరిపై వస్తున్న ఆరోపణలు, వీడియోల లీకేజీపై పదునైన వ్యాఖ్యలు చేశారు. నేనెందుకు ఈ విషయాలన్నీ రీతూకి చెప్పాలి? కానీ బయట జరుగుతున్న ఈ వీడియోలు చేసే వాళ్లది తప్పు. ఒక ఆడపిల్లను, ఆడపిల్ల జీవితాన్ని అలా పబ్లిక్ చేయకూడదు.
ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విషయాలు ఉంటాయి. ఇలా బయటికి వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టి నాశనం చేయకూడదు. రీతూ చౌదరిని ఉద్దేశిస్తూ మాత్రమే కాకుండా, సాధారణంగా మహిళల జీవితాలను పబ్లిక్ చేయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది రీతూ చౌదరి అయినా, ఏ అమ్మాయి అయినా.. ఒక మహిళ జీవితాన్ని బయటపెట్టే అర్హత ఎవరికీ లేదు. మహిళ ఇష్టమొచ్చినట్లు బతుకుతుంది, ఆ అర్హత ఆమెకు ఉంది. ఏ మహిళ జీవితంపై అయినా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు," అని దివ్వెల మాధురి కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications