'డీజే టిల్లు -2 రివ్యూ : టిల్లుగాడు రచ్చ రంబోలా
సిద్దు జొన్నలగడ్డ చేసింది తక్కువ సినిమాలే అయిన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా డీజే టిల్లు సినిమాతో యూత్‌లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. డీజే టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీలో డీజే టిల్లు సినిమాకు ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం అభిమానులపై ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో డీజే టిల్లు సీక్వెల్ తెరక్కిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. డీజే టిల్లు మొదటి పార్ట్‌లో నేహాశర్మ హీరోయిన్‌గా నటించగా, రెండో పార్ట్‌లో అనుమప పరమేశ్వరన్ డీజే టిల్లుతో రొమాన్స్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో డీజే టిల్లు-2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే టిల్లుకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు.ఇక దానికి టిల్లు మాత్రం నేను ఎవరిని పెళ్లి చేసుకోను నేను ఇలాగే సోలోగా నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తా అని కుటుంబ సభ్యులకు చెబుతుంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు పబ్‌లో అతనికి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) కలుస్తుంది. లిల్లీతో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారుతుంది. ఆ తరువాత సిద్దు లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) కోసం మాఫియాతో పోరాడాల్సి వస్తుంది. టిల్లు మొదటి పార్ట్‌లో ఎలాగైతే రాధిక తనని మోసం చేసి వెళ్ళిపోయిందో లిల్లీ కూడా అలాగే టిల్లుని మోసం చేసి వెళ్ళిపోతుందనే అనుమానం కలుగుతుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్‌ను బయటపెడతారు. అయితే చివర్లో లిల్లీ టిల్లును వదిలేస్తుందా లేక పెళ్లి చేసుకుంటుందా అనేది మీరు సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
డీజే టిల్లు మొదటి పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్‌ను కూడా చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. దర్శకుడు మల్లిక్ రామ్ పనితీరు తెర మీద కనిపిస్తోంది. డీజే టిల్లు-2లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ అవి మరి పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. ప్రేక్షకులు ఈ సీన్లు బాగా ఎంజాయ్ చేస్తారు.సిద్దు అనుపమల మధ్య వచ్చే కొన్ని సీన్లు అయితే కామెడీని పంచుతూనే ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేశాయి. ఈ సినిమా ఫస్ట్ అఫ్ మొత్తాన్ని ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్లాడు దర్శకుడు. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా అదే ఎంటర్ టైన్ మెంట్ కంటిన్యూ చేసినప్పటికి చివరలో కొంత ఎమోషనల్ సీన్స్ అనేది యాడ్ చేయడం సినిమాకి కొంత మైనస్‌గా మారింది. చివర్లో వచ్చే ట్విస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు.
నటీనటుల పర్ఫామెన్స్
ఇక నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. మొదటి పార్ట్‌లో ఎలాగైతే తనని తాను డీగ్రేడ్ చేసుకుంటూ కామెడీని పండించాడో ఈ సినిమాలో అంతకుమించి కామెడీని వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ చెప్పే డైలాగులు ప్రేక్షకులను అలరిస్తాయి. తనకంటూ ఒక సపరేట్ మేనరిజంతో చాలా ఈజీగా డైలాగులను చెబుతూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ చూపించాడు.

ఇక అనుపమ పరమేశ్వరన్ అటు గ్లామర్ షో చేస్తూనే నటన పరంగా కూడా చాలా సెటిల్డ్‌గా నటించింది. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ సినిమాకు పెద్ద అసెట్ అనే చెప్పాలి. తనకున్న పరిధిలో అనుపమ బాగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి పార్ట్‌లో నేహా శర్మ ఎలాగైతే నటించిందో సెకండ్ పార్ట్‌లో అనుపమ కూడా తనకు ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి నటనను కనబర్చింది. కొన్ని సీన్లలో తనదైన యాక్టింగ్‌తో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ప్లస్ అయిందనే చెప్పాలి. అలాగే విజువల్స్ కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో చూపించాయి. ప్రొడక్షన్ విలువలు చాలా రీచ్‌గా కనిపించాయి. చిన్న సినిమా అని ఏమాత్రం ఆలోచించకుండా భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్
సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్
కామెడీ సీన్లు
మైనస్ పాయింట్స్
లాజిక్ లేని కొన్ని సీన్లు












Click it and Unblock the Notifications