Rashmika:న‌టి రష్మిక మంద‌న్నా నెల సంపాద‌న...తెలిస్తే షాక్‌..

గీత గోవిందంతో సినిమాతో మంచి స్టార్ డ‌మ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మంద‌నా. ఇక‌, ఆ సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవ‌కాశం రాలేదు. సినీ రంగంలో అడుగుపెట్టిన అది కొద్ది స‌మయంలోనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లను ఆక‌ట్టుకుంది. క‌న్న‌డ‌, తెలుగు చిత్రాల‌తో త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన ర‌ష్మిక‌, వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కేవ‌లం తెలుగులోనే కాకుండా, త‌మిళం, బాలీవుడ్‌లో కూడా సినిమాలు తీసి భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు, ఇండ‌స్ర్టీలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టీమ‌ణుల జాబితాలో చేరిపోయారు ర‌ష్మిక‌. ప్రస్తుతం చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజిగా ఉన్నారు. త్వ‌ర‌లోనే యానిమ‌ల్‌, పుష్ప‌2 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కోట్ల విలువ చేసే ఇళ్లు, కార్లు...

రష్మికకు బెంగళూరులో 8 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత విలాసవంతమైన మాన్షన్-కమ్-విల్లా ఉందంట‌. అలాగే హైదరాబాద్, ముంబై వంటి న‌గ‌రాల్లో కూడా విలాసవంతమైన ఇళ్ల‌ను కొనుగోలు చేసిందంట‌. ఈ న‌టి కార్ల‌ను కూడా ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే ఈమె ద‌గ్గ‌ర అత్యంత ఖ‌రీదు చేసే కార్లు కూడా చాలానే ఉన్నాయి. అందులో కోటి రూపాయ‌లు విలువ చేసే Mercedes Benz-C క్లాస్ ఉంది. అంతేకాదు, 40 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే Audi Q3 కూడా ఉంది. వీటితో పాటు టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటాను వంటి బ్రాండ్ క‌లిగిన కార్లు కూడా ర‌ష్మిక ద‌గ్గ‌ర ఉన్నాయి. ఇక, ఇలాంటి సెల‌బ్రీటీలు ధ‌రించే హ్యాండ్ బ్యాగ్‌ల ద‌గ్గ‌రి నుంచి చెప్పుల వ‌ర‌కూ అన్ని ఎన్నో ల‌క్ష‌లు విలువ చేసేవే క‌దా. ఆమె ధ‌రించే లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు సుమారు మూడు నుంచి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేస్తాయ‌ట‌..ఇంత విలువ చేసే వ‌స్తువులు ఆమె ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు ఆమె సంపాద‌నెంతో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఎవ్వ‌రికైనా ఉంటుంది క‌దా.

 Rashmika:

ఒక్కో సినిమాకు కోట్ల‌లోనే..

ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంద‌ని స‌మాచారం. ఒక్కో సినిమాకు సుమారు 4 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేస్తుంద‌ని టాక్‌. కేవ‌లం సినిమాలే కాకుండా ఇత‌ర బ్రాండ్స్‌కు సంబంధించిన యాడ్‌లు కూడా చేస్తూనే ఉంటారు. ఆమె నికర విలువ సుమారు 45 కోట్ల రూపాయ‌లు ఉండొచ్చ‌ని అంచ‌నా. కొన్ని నివేదిక‌ల ప్ర‌కారం, ఆమె వార్షిక ఆదాయం సుమారు 8 కోట్ల రూపాయ‌లు.. అంటే నెల‌కు ర‌ష్మిక సంపాద‌న అక్ష‌రాలు 60 ల‌క్ష‌ల రూపాయ‌లన్న‌మాట‌... అయితే, ర‌ష్మిక‌కు సోష‌ల్‌మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్క‌వుగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 39.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉంది ఈ బ్యూటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+