అక్కినేని నాగార్జున అసలు పేరు తెలుసా?

యువసామ్రాట్ గా పేరు తెచ్చుకొని అగ్ర కథానాయకుల్లో ఒకడిగా ఉన్న అక్కినేని నాగార్జున కాలక్రమంలో మన్మథుడు నాగార్జునగా మారారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున అయ్యారు. సినిమా ఒక్కటే ఆయన వ్యాపకం కాదు. అనేకరకాల వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్స్, కన్ స్ట్రక్షన్స్, కన్వెన్షన్స్.. ఇలా చాలారకాల వ్యాపారాలున్నాయి. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను మలుపుతిప్పారు. అటువంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను, అటువంటి దర్శకుడిని పరిశ్రమకు అందించారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో చాలా ముందుంటారు.

పరిశ్రమకు మూలస్తంభాల్లా నిలిచారు
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో కలిసి 1990 దశాబ్దంలో తిరుగులేని హీరోగా చెలామణి అయ్యారు. ఈ నలుగురు పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా నిలబడ్డారు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోల్లో బాలయ్య వరుస సూపర్ హిట్లతో అగ్రస్థానంలో ఉండగా, వెంకటేష్, చిరంజీవి తర్వాత స్థానాల్లో నిలిచారు. నాగార్జున ఒక్కరే బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంలో బాకీ పడ్డారు. ప్రస్తుతం ధనుష్ కుబేర, రజనీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. కూలీలో విలన్ గా తొలిసారి నటిస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత తన 100వ సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. దీనికోసం ఎన్నో కథలను వింటున్నారు.

do you know hero Akkineni Nagarjuna original name

ఆలస్యంగా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారు
సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నాగార్జున అనే అందరూ పిలిచారు. అయితే చాలామందికి నాగార్జున అసలు పేరు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు తన చిన్నకొడుకైన నాగార్జునకు నాగార్జున సాగర్ అనే పేరు పెట్టారు. నాగార్జున జన్మించిన సమయంలో నాగార్జున సాగర్ లాంటి అతి పెద్ద మానవ నిర్మిత మహాసాగరం లాంటి ఆనకట్ట నిర్మాణమవడంతో నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నాగార్జున తన పేరు చివర ఉన్న సాగర్ అనేదాన్ని తీసేసి నాగార్జున అని ఉంచుకున్నారు. ఇప్పటివరకు అదేపేరుతో కొనసాగుతున్నారు. నాగార్జున అసలు పేరు నాగార్జునసాగర్ అని తెలిసి అభిమానులు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి,మోహన్ బాబు, రజనీకాంత్ లా నాగార్జున కూడా పేరు మార్చుకున్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+