ప్రశాంత్ నీల్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ ఎన్ని కిలోలు తగ్గారో తెలుసా..?
సినిమా కోసం సినిమాలో పాత్రల కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నారు మన హీరోలు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలు నుంచి కుర్రహీరోలు వరకు సినిమాలో వారి పాత్ర కోసం బరువు పెరగడం, తగ్గడం సిక్స్ ప్యాక్ లు చేయడం వంటివి చేస్తూనే ఉంటున్నారు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
గతంలోనూ..
ఎన్టీఆర్ సినీ కెరీర్ మొదట్లో లావుగా ఉండేవారు. రాఖీ సినిమాలో బాగా లావుగా కనిపిస్తారు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో చేసిన యమదొంగ కోసం సన్నగా మారారు. ఇక అప్పటి నుంచి బాడీని మెయింటైన్ చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. ఇక టెంపర్, అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో తారక్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. రీసెంట్ గా వచ్చి బ్లాక్ వస్తార హిట్ కొట్టిన దేవరా సినిమాలో సైతం తండ్రి పాత్ర కోసం కొంచెం లావుగా, కొడుకు పాత్ర కోసం కొంచెం సన్నగా కనిపించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చూడడానికి కొంచెం లావుగా కనిపిస్తాడు. ఒక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డారు. అయితే ఎన్టీఆర్ ఇటీవల కొంతకాలంగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌లో, కళ్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సన్నగా కనిపించారు ఎన్టీఆర్. దీంతో మా హీరోకి ఏమైంది అంటూ ఆయన అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయితే ఎన్టీఆర్ సడన్ గా బాగా సన్నబడడానికి కారణం ప్రశాంత్ నీల్ సినిమా కోసమే అని రీసెంట్ గా కళ్యాణ్ రామ్ చెప్పడంతో అభిమానులు అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్ని కేజీలు తగ్గారంటే.. ?
దాదాపు ఐదు నెలల్లోనే ఎన్టీఆర్ సుమారుగా 18 కేజీల బరువు తగ్గారని అంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు వర్కౌట్ చేసి, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్ తో ఎన్టీఆర్ డైట్ ను పాటించారని చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి పోయారని తెలిపారు. ఈ క్రమంలోనే సినిమా కోసం నీ డెడికేషన్ సూపర్ అన్నా అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు రీసెంట్ గానే నీల్ - ఎన్టీఆర్ సినిమా తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించారు. ఇక నేటి నుంచి సెకండ్ షెడ్యూల్ జరగనుండగా.. షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications