కల్కి కోసం విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నాడో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఏడి చిత్రం ఈ నెల 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక, ఈ సినిమాపై చాలామంది సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు. కల్కి సినిమాలో చాలామంది స్టార్స్ కనిపిస్తారు. రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం విడుదలయిన రెండు రోజుల్లోనే రూ.298.5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి ఎందరో స్టార్స్ వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరితో పాటు ఈ చిత్రంలో మరికొంతమంది స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో నటించి అలరించారు. అందులో మాళవిక నాయర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ కెవి వంటివారున్నారు. ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన రౌడీ బాయ్ గురించి ఓ న్యూస్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలోని ఐదునిమిషాల పాత్ర కోసం విజయ్ ఎంత తీసుకున్నాడనేది ఇప్పడు నెట్టింట తెగ హాల్చల్ చేస్తోంది.
కల్కి సినిమాలో అర్జునిడి పాత్రలో ఐదు నిమిషాలపాటు కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. అయితే, ఈ పాత్ర కోసం విజయ్‌దేవరకొండ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. అయితే, దర్శకుడు నాగ్ అశ్విన్ లైన్ చెప్పగానే ఈ సినిమాకు విజయ్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏ మాత్రం పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక, కల్కి సెకండ్ పార్ట్‌లో కూడా అర్జునుడి పాత్రకు మరికొన్ని సీన్న్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించిన స్టార్స్ చాలామంది చాలామొత్తంలో వసూలు చేసారని సమాచారం.

హీరోగా నటించిన ప్రభాస్ కల్కి సినిమా కోసం రూ.80 కోట్లు వసూలు చేశాడని టాక్. దీపికా పదుకుణే రూ. 20 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ. 20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. చిన్న చిన్న రోల్స్‌లో నటించిన వారంతా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ ఠాకూర్, రాజమౌళి సహా మిగతా నటీనటులు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టీ టౌన్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.












Click it and Unblock the Notifications