రకుల్ పెళ్లిచేసుకుంటున్న రిసార్ట్ రెంట్ ఎంతో తెలుసా?
తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మెరుస్తోంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది.. ఇప్పుడు అదే ప్రేమ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఫిబ్రవరి 21న గోవాలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగబోతోంది. గతంలో విదేశాల్లో పెళ్లిచేసుకోవాలనుకున్న ఈ జంట ఇప్పుడు గోవాలో చేసుకోబోతున్నారు.
గోవాలోని ఓ లగ్జరీ హోటల్ లో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి జరగబోతోంది. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ హోటల్ వీరి వివాహానికి వేదికగా మారింది. గోవాలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ గా ఇది పేరు గాంచింది. ఇంతటి విలాసవంతమైన హోటల్ ను చూడటానికి అందంగా ఉండటమే కాదు.. ఇందులో ఒక్కో రూమ్ అద్దె కూడా అంతే భారీగా ఉంటుంది.

ఒక్కో రూమ్ కు రూ. 19 వేల నుంచి రూ.75 వేల వరకు చెల్లించాలి. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట తమ వివాహం కోసం మొత్తం మూడు రోజుల పాటు ఈ హోటల్ ను బుక్ చేసుకున్నారు. దీనికి వారు భారీగానే ఖర్చుపెడుతున్నారు. 19వ తేదీ నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. వీరిద్దరి వివాహం పూర్తి ఎకో ఫ్రెండ్లీగా జరగబోతోంది. పెళ్లికి వచ్చే అతిథులకు ఆహ్వానాన్ని డిజిటల్ గా పంపించారు. పెళ్లి వేడుకల్లో పటాకులు లేకుండా చూడటంతోపాటు అన్నిరకాలుగా ప్రకృతికి ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా రకుల్ అయలాన్ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. శివకార్తికేయన్ హీరోగా నటించాడు. జనవరి చివరి వారంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయంతోపాటు మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది.












Click it and Unblock the Notifications