సన్నీలియోన్ ఆస్తుల విలువ తెలుసా?
సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేక పాత్రలు, ఐటెం సాంగ్స్ లో నటిస్తూ ఎంతో పాపులారిటీని పొందింది. ప్రధానంగా బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేకపోయినప్పటికీ ఆమె తన ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. సన్నీ నెలవారీ ఆదాయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తాజాగా రెడ్ ఆఫ్ షోల్డర్ బాడీ కాన్ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ చేసి వాటిని షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
ఫొటో షూట్లలో తక్కువ మేకప్, అతి తక్కువ నగలతో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకటనలు కూడా చేస్తోంది. ఒక ప్రాజెక్టు కోసం సన్నీ రూ.3కోట్ల వరకు తీసుకుంటుంది. ప్రత్యేక పాటల్లో నర్తించాలంటే రూ.2 కోట్లు తీసుకుంటుంది. అంతేకాకుండా బ్యూటీ ప్రొడక్ట్ బ్యాండ్ ను సొంతంగా నడుపుతోంది. దీనిద్వారా నెలకు కోటిరూపాయలు సంపాదిస్తోంది. హిందీ, తెలుగులో అవకాశాలు బాగా వస్తుండటంతో భారీ పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఎంతోమంది దర్శకులు ఆమెలో ఉన్న గ్లామర్ ని చూపిస్తున్నారేకానీ ఆమెలో ఉన్న నటనా ప్రతిభను మాత్రం బయటకు తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం చేయడంలేదు. హీరోయిన్ కాలేకపోయినా ఈమె ఇలా ఐటెం సాంగ్స్ తో సరిపెట్టుకోవడమే కాదు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తాను షేర్ చేసే పోస్టుల ద్వారా కూడా భారీగానే ఆర్జిస్తోంది. సినిమాలు, ప్రకటనలు, సొంత వ్యాపారాల ద్వారా భారీగానే ఆర్జిస్తోన్న సన్నీలియోన్ ఆస్తి విలువ రూ.120 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. తనకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు.












Click it and Unblock the Notifications