ఏంటీ రామ్ చరణ్ ఉపాసనను అలా పిలుస్తాడా..?
తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది.
ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు. దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా కోడలు ఉపాసన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవ్ పేజ్‌పై రామ్ చరణ్- ఉపాసన దంపతుల ఫొటో వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన భార్య ఉపాసనను ముద్దుగా "ఉప్సి - ఉప్సి" అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారట. ఫోన్లో కూడా అదే పేరుతో సేవ్ చేసుకున్నాడట రామ్ చరణ్. మొదటి నుంచి రామ్ చరణ్‌కి ఉపాసనను అలా పిలవడమే ఇష్టమని తెలుస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ప్రేమగా ఉపాసనను ఉప్సి అనే పిలుస్తారట.
అటు ఉపాసన సైతం మెగా ఫ్యామిలీకి అత్యంత విలువనిస్తోంది. ఇక రామ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.












Click it and Unblock the Notifications