చిరు, బాలయ్య బాక్సాఫీస్ దగ్గర తొలిసారిగా ఎప్పుడు ఢీకొన్నారో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి, బాలకృష్ణ అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉన్నప్పటికీ వీరి అభిమానుల మధ్య యుద్ధం మాత్రం ఇండియా, పాకిస్తాన్ కన్నా హోరాహోరీగా జరుగుతుంటుంది. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే, మరి కొన్నిసార్లు బాలకృష్ణ పైచేయి సాధిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరి మధ్య జరిగే యుద్ధం ఏ ఇద్దరు హీరోల మధ్య, అసలు ఇండియాలోనే ఏ హీరోల మధ్య జరగదని చెప్పొచ్చు. అసలు వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర తొలిసారిగా ఎప్పుడు ఢీకున్నారు? ఎవరు విజయం సాధించారు? అనే విషయాన్ని తెలుసుకుందాం.
బాలయ్య సంచలన విజయం
1984 సెప్టెంబరులో చిరంజీవి, బాలకృష్ణ తొలిసారిగా బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు మొత్తం 24 సార్లు ఢీకొన్నారు. అందులో కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధించారు. ఈ 24లో కొన్నిసార్లు సంక్రాంతికి తలపడ్డారు. 1984 సెప్టెంబరు 7వ తేదీన బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమా విడుదలైంది. వారం రోజుల తర్వాత 14వ తేదీన చిరంజీవి ఇంటిగుట్టు విడుదలైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన మంగమ్మగారి మనవడు సంచలన విజయం సాధించింది. ఈ సినిమా 500 రోజులకు పైగా థియేటర్లో ఆడింది. భానుమతి రామకృష్ణ, సుహాసిని, గొల్లపూడి మారుతీరావు, గోకిన రామారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

గుంటూరులో శతదినోత్సవం
వర్మ ప్రొడక్షన్స్ బ్యానరుపై కె.బాపయ్య దర్శకత్వంలో డీవీఎస్ రాజు ఇంటిగుట్టును నిర్మించారు. నళిని, సుహాసిని, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలయ్యే పై చేయి సాధించారు. చిరంజీవికి ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. మంగమ్మగారి మనవడు అంత స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినప్పటికీ పర్వాలేదు అనే రీతిలో 100 రోజులు ఆడింది. శతదినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. అలా తొలిసారిగా బాక్సాఫీస్ దగ్గర ఢీకొన్న ఈ ఇద్దరు అగ్ర హీరోలు 40 సంవత్సరాల తర్వాత కూడా నువ్వా? నేనా? అనే రీతిలో తలపడుతుండటం విశేషమనే చెప్పొచ్చు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications