‘కల్కి’లో కృష్ణుడుగా నటించింది ఎవరో తెలుసా..?
ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకునే, అమీతాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు.
పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు.

ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా చూసిన ప్రేక్షకులకు కల్కిలో కృష్ణుడుగా నటించింది ఎవరా అనే ప్రశ్న ఉత్పన్నం అయింది. ఎందుకంటే సినిమాలో కృష్ణుడు ఫేస్‌ను చూపించలేదు.ఆ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి బాడీ లాంగ్వేజ్ అచ్చం హీరో నాని మాదిరగా ఉండటంతో మొదట అంతా అతనే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ సినిమాలో కృష్ణుడు పాత్రలో కనిపించింది ఓ తమిళ నటుడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించడంతో క్లారిటీ వచ్చినట్టు అయింది. తమిళ నటుడు కృష్ణ కుమార్ (కేకే) కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రను పోషించారు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం 'ఆకాశం నీ హద్దురా'తో పలకరించారు. ఈ మూవీలో సూర్యకు స్నేహితుడిగా కేకే నటించారు. ధనుష్ 'మారన్' 'కాదళగి' వంటి సూపర్ హిట్ సినిమాల్లో కృష్ణ కుమార్ నటించారు. కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రలో తానే నటించానని కృష్ణ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశారు. దీంతో కృష్ణుడు పాత్ర పోషించిన నటుడు గురించి ఉన్న సస్పెన్స్‌కు తెర వీడినట్టు అయింది.












Click it and Unblock the Notifications