అన్నతో రొమాన్స్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. హీరోలతో పోలిస్తే, హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది. దీంతో వాళ్లు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటుంటారు. అయితే ఇదే సమయంలో వయస్సులో సంబంధం లేకుండా నటించాల్సి ఉంటుంది. తండ్రితో హీరోయిన్‌గా నటించిన ఆమె, ఆయన కొడుకుతో కూడా నటించాల్సి వస్తుంది. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం.అయితే ఓ హీరోయిన్ మాత్రం విచిత్రంగా ఓ హీరోను అన్న అంటూ పిలిచి అతనితోనే రొమాన్స్ చేసింది. ఇలా హీరోను అన్నయ్య అంటూ అతనితో నటించిన హీరోయిన్ మరెవరో కాదు రోజా. ఆ హీరో మరెవరో కాదు.. శ్రీకాంత్.
1990ల్లో రోజాకు హీరోయిన్‌కు ఫుల్ డిమాండ్ ఉండేది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు, అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న జగపతి బాబు, శ్రీకాంత్ వంటి హీరోలతో సైతం ఆమె నటించారు. శుభలగ్నం,అన్నమయ్య,ముఠా మేస్త్రి,ముగ్గురు మొనగాళ్ళు, భైరవద్వీపం,అన్నా, బొబ్బిలి సింహం , క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, పెద్దన్నయ్య ,శ్రీ కృష్ణార్జున విజయం, సామక్క సారక్క వంటి సూపర్ హిట్ సినిమాలు రోజా ఖాతాలో ఉన్నాయి.

హీరో శ్రీకాంత్‌కు రోజాకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే హీరో శ్రీకాంత్‌ను రోజా విచిత్రంగా అన్నయ్య అంటూ పిలిచేవారట. ఈ విషయాన్ని హీరో శ్రీకాంతే స్వయంగా ఓ షోలో చెప్పడం జరిగింది. దీని వెనుక ఉన్న కారణం కూడా వివరించారాయన.
'సీతారత్నం గారి అబ్బాయి' సినిమాలో రోజా శ్రీకాంత్‌కు చెల్లిగా నటించి, ఆ తర్వాత 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాలో భార్యగా రోజా నటించిందని శ్రీకాంత్ వెల్లడించారు.ఒకరికొకరు అన్నయ్య-చెల్లిగా చూసుకున్న తర్వాత, భార్యాభర్తలుగా నటించాల్సి వస్తే కొంత ఇబ్బందే అని తెలిపారు. ఎందుకంటే తెరపై పాత్రలకు తగినట్లుగా భావోద్వేగాలను పలికించాలంటే, వ్యక్తిగత అనుబంధాలను పక్కన పెట్టి, పాత్రలో లీనం కావాల్సి ఉంటుందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
దీనిపై రోజా మాట్లాడుతూ.. అది కిచెన్‌లో వచ్చే రొమాంటిక్ సీన్. నన్ను శ్రీకాంత్ వెనుక నుంచి వచ్చి కౌగిలించుకుని డైలాగులు చెప్పాలి. నన్ను కౌగిలించుకున్న వెంటనే శ్రీకాంత్ డైలాగ్ మరచిపోతున్నారు. అందుకే 27 టేకులు అవసరం అయ్యాయి అని రోజా తెలిపింది.
-
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications