శోభిత ధూళిపాళ ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది.
ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. తాజా ఈ భామ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని, ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. నేను నల్లగా ఉండడంతో అక్కడ నన్ను చూసి నువ్వు మోడల్ ఏంటి కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆడిషన్ తర్వాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా ఏడ్చానని శోభిత తెలిపారు.

నెమ్మది నెమ్మదిగా ఈ విషయాలన్నీ పక్కనపెట్టి అందం అనేది మ్యాటర్ కాదని ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకోవాలని ఆడిషన్స్‌కి వెళ్తూ ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఇదే సమయంలో తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్న వయసులో ఓ వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు. నేను ఎంత ప్రయత్నించినా.. నా ప్రేమను అంగీకరించలేదు. అతను ఓ స్టుపిడ్. నన్ను చాలా బాధపెట్టింది. అయితే నా ఫస్ట్ క్రష్ మాత్రం స్కూల్ డేస్‌లో జరిగింది.
అతడే నా క్లాస్‌లో కెప్టెన్. అతనంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ అతనికి చెప్పలేదు.స్కూల్ డేస్‌లో క్రష్ అంటే ఏమిటో తెలియని సమయంలో అవన్నీ జరిగాయి.నా లైఫ్‌లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి. కానీ తాను చదువుపైనే దృష్టి పెట్టానని శోభిత చెప్పుకొచ్చింది. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే, తెలుగు, తమిళ, హిందీ బాషాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవల శోభిత 'మంకీ మ్యాన్'తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications